లక్ష్మీదేవిగా మారిన వంటలక్క.. అక్కడైనా ఏడుపు ఆపాలంటూ?

బుల్లితెరపై ప్రసారమయ్యే కార్తీకదీపం సీరియల్ లోని వంటలక్క పాత్రలో నటిస్తున్నటువంటి ప్రేమి విశ్వనాథ్ కు ఎనలేని ప్రేక్షకాదరణ ఉందని చెప్పవచ్చు.చాలామంది మహిళలు ఈమెకి అభిమానులుగా మారిపోయారు.

 Premi Vishwanath Turns As Goddess Lakshmi For A Special Show In Star Maa, Premi Viswanath , Vantalakka , Goddess Lakshmi, Special Show , Star Maa, Varalakshmi Vratam, Shravana Masam, Viral Promo, Deeps, Karthika Deepam-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈ సీరియల్ కి రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతోమంది అభిమానులు ఉండటం చేత ఈ సీరియల్ బుల్లితెరపై టాప్ వన్ రేటింగ్స్ తో దూసుకుపోతోంది.

ఇదిలా ఉండగా కార్తీకదీపం సీరియల్లో వంటలక్క ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి ప్రేమి విశ్వనాథ్ ఏకంగా లక్ష్మీదేవిగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు స్టార్ మా నిర్వాహకులు.

 Premi Vishwanath Turns As Goddess Lakshmi For A Special Show In Star Maa, Premi Viswanath , Vantalakka , Goddess Lakshmi, Special Show , Star Maa, Varalakshmi Vratam, Shravana Masam, Viral Promo, Deeps, Karthika Deepam-లక్ష్మీదేవిగా మారిన వంటలక్క.. అక్కడైనా ఏడుపు ఆపాలంటూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం శ్రావణ మాసం కావడంతో మహిళలు పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తారు.ఈ క్రమంలోనే శ్రావణమాసంలో వరలక్ష్మీ వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు.ఇదిలా ఉండగా వరలక్ష్మీ వ్రతం అనే పేరుతో స్టార్ మా ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది.ఇందులో భాగంగా ప్రేమి విశ్వనాథ్ అలియాస్ దీపను లక్ష్మీదేవిగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది.ఈ ప్రోమోలో భాగంగా వంటలక్క లక్ష్మీదేవిగా కనిపించడంతో అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

Telugu Deeps, Goddess Lakshmi, Karthika Deepam, Premi Viswanath, Shravana Masam, Show, Maa, Vantalakka, Promo-Movie

ఈ క్రమంలోనే ఈ ప్రోమో చూసిన పలువురు నెటిజన్లు వంటలక్క సాక్షాత్తు అమ్మవారు ఇలా ఉందని కామెంట్ చేయగా మరికొందరు పోనీలే ఇక్కడైనా వంటలక్క సంతోషంగా ఉంది.అంటూ కామెంట్ చేస్తున్నారు.అలాగే మరికొందరు వంటలక్క కాస్త వరలక్ష్మి అయింది అంటూ కామెంట్లు పెడుతున్నారు.ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే ఈ కార్యక్రమాన్ని శ్రావణ శుక్రవారం ప్రసారం చేస్తారా.లేక పోతే శని ఆదివారాలలో ప్రసారం చేస్తారా.

అనేది తెలియాల్సి ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube