అమ్మవారిగా వంటలక్క విశ్వరూపం..!  

Karthika Seepam Serial Vantalakka as Amma varu,star maa, vantalakka, Premi Vishwanath, dussara festival event, instagram, social media - Telugu Insta Gram, Premi Vishwanath, Social Media, Star Maa, Vantalakka

తెలుగు బుల్లి తెరపై తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సీరియల్ యాక్టర్ ప్రేమి విశ్వనాథ్.స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే కార్తీకదీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

TeluguStop.com - Premi Vishwanath Special Performance In Star Maa Special Event

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సీరియల్ కు ఎంతోమంది ఫాన్స్ పెద్దఎత్తున ఉన్నారు.ఈ సీరియల్ ప్రతిరోజు చూడకపోయిన వారైనా సరే కార్తీకదీపం సంబంధించిన విషయాలు అప్పుడప్పుడు మీడియా ఛానల్స్ ద్వారా తెలుసుకుంటూనే ఉంటారు.

ఇందులో వంటలక్క పాపులారిటీ, డాక్టర్ బాబు పాత్ర, పిల్లల విషయాల గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఒక టాపిక్ నడుస్తూనే ఉంటుంది.ప్రపంచవ్యాప్తంగా హాలీవుడ్ సూపర్ హీరోలు ఎంత ప్రసిద్ధి చెందినారో మన తెలుగు రాష్ట్రాలలో కార్తీకదీపం సీరియల్ లోని అన్ని పాత్రధారులు అంత ఫేమస్.

TeluguStop.com - అమ్మవారిగా వంటలక్క విశ్వరూపం..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇక ఈ సీరియల్ లో వంటలక్కగా రోల్ ప్లే చేసిన ప్రేమి విశ్వనాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.తెలుగు సీరియల్స్ లో ఎవరికి లేనంత స్టార్ డమ్ ను ఆమె సొంతం చేసుకుంది.

దీనికి కారణం ఆవిడ నటించే నటన అలాగే, ఆమె గెటప్.అచ్చం దక్షిణ భారతదేశ మహిళ ఎలా ఉండాలో అలా కట్టు బొట్టు పెట్టుకుని మన పక్కింటి అమ్మాయిలా ఉండేవిధంగా కనపడుతుంది.

చూడడానికి రంగులో కాస్త తక్కువగా ఉన్న గుణంలో మాత్రం ముందు ఉండే విధంగా ప్రేమి విశ్వనాథ్ తన రోల్ ను సీరియల్ చేస్తోంది.ఇకపోతే సీరియల్ లో నటించిన ప్రేమ విశ్వనాధ్ బయట ఎవరైనా ఆమెను చూస్తే మాత్రం కచ్చితంగా ఫిదా అవ్వాల్సిందే.

అయితే సోషల్ మీడియాలో చాలా తక్కువగా కనపడుతూ ఉంటారు ఈవిడ.అయితే తాజాగా ఓ ఫంక్షన్ లో మాత్రం ఈవిడ అమ్మవారి పాత్రలో మెరిసింది.

నిజంగా అక్కడ అమ్మవారి రూపంలో ఉన్న ప్రేమి విశ్వనాథ్ ను చూసి నిజంగా షాక్ అయ్యారు ప్రేక్షకులు.ప్రతి పండుగకు ప్రతి ఛానల్ వాళ్ళు స్పెషల్ ఈవెంట్స్ చేస్తుంటారు.

ఈ సమయంలోనే భారీ ఈవెంట్లను ప్లాన్ చేస్తూ ఉంటారు.ఇక పొతే తాజాగా ఈ సారి స్టార్ మా ఛానల్ వారు దసరాకు ” జాతరో జాతర “ ఈవెంట్ చేస్తున్న సమయంలో ఇందులో ప్రేమి విశ్వనాథ్ అమ్మవారుగా నటించింది.

దీనికి సంబంధించి ప్రోమో తాజాగా విడుదల అయ్యింది.ఇందుకు సంబంధించి ఈవెంట్లో ప్రేమి విశ్వనాథ్ అమ్మోరుగా పరకాయ ప్రవేశం చేసినట్లుగా నటించేసింది.

ఈ వీడియోలో కేవలం పది సెకన్లు మాత్రమే కనిపించిన ఆవిడ ప్రేక్షకులను ఇట్లే కట్టిపడేసింది.చూడాలి మరి పండగ రోజు ఈవిడ తన పర్ఫామెన్స్ ఏ విధంగా చేసిందో.

#Social Media #Star Maa #Insta Gram #Vantalakka

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Premi Vishwanath Special Performance In Star Maa Special Event Related Telugu News,Photos/Pics,Images..