కార్తీకదీపం ఫ్యాన్స్ కు శుభవార్త.. శుభం కార్డు ఎప్పుడంటే..?

బుల్లితెర నంబర్ 1 సీరియల్ గా పేరు తెచ్చుకున్న కార్తీకదీపం సీరియల్ 1,000 ఎపిసోడ్లు పూర్తి చేసుకోవడంతో ఈ సీరియల్ యూనిట్ సెలబ్రేషన్స్ కూడా జరుపుకున్న సంగతి తెలిసిందే.అయితే వెయ్యి ఎపిసోడ్లు పూర్తి కావడంతో అతి త్వరలో ఈ సీరియల్ పూర్తవుతుందని వార్తలు వచ్చాయి.

 Good News For Premi Vishwanath Karthika Deepam Serial Fans , Karthika Deepam, Pr-TeluguStop.com

కానీ ఇప్పట్లో ఈ సీరియల్ కు శుభం కార్డు పడదని మరో 1,000 ఎపిసోడ్ల వరకు ఈ సీరియల్ కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది.

ప్రేమీ విశ్వనాథ్, సీరియల్ లో మోనిత పాత్రలో నటిస్తున్న శోభాశెట్టి ఈ సీరియల్ నిర్మాత వెంకటేశ్వరరావు కలిసి కార్తీకదీపం సీరియల్ గురించి మాట్లాడుకుంటున్న వీడియోను ప్రేమీ విశ్వనాథ్ ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు.

ఈ వీడియోలో ఇంకా కార్తీకదీపం సీరియల్ ను ఎన్ని ఎపిసోడ్లు ప్లాన్ చేశారని ప్రేమీ విశ్వనాథ్ నిర్మాతను అడగగా నిర్మాత మరో 1,000 ఎపిసోడ్లు కొనసాగించాలని ప్లాన్ చేసినట్టు చెప్పారు.

కార్తీకదీపం సీరియల్ ను ఇష్టపడే ఫ్యాన్స్ కు ఇది శుభవార్తే అని చెప్పాలి.మరో 1,000 ఎపిసోడ్లు ఈ సీరియల్ ను కొనసాగిస్తే మాత్రం ఈ సీరియల్ మరిన్ని కొత్త ట్విస్టులతో ప్రేక్షకులను అలరించే అవకాశం ఉంది.అయితే వంటలక్క డాక్టర్ బాబును కలిపి సీరియల్ ను వేరే ట్విస్టులతో కొనసాగించమని కార్తీకదీపం ఫ్యాన్స్ కోరుతుండటం గమనార్హం.

మరోవైపు ఈ సీరియల్ అంచనాలను మించి టీఆర్పీ రేటింగ్ లను సాధిస్తోంది.

తెలుగులో ఏ సీరియల్ కు రాని స్థాయిలో ఈ సీరియల్ కు గుర్తింపు వస్తూ ఉండటం గమనార్హం.

మలయాళంలో హిట్టైన ఈ సీరియల్ తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా రీమేక్ కావడంతో పాటు అక్కడ కూడా మంచి టీఆర్పీ రేటింగ్ లను సొంతం చేసుకుంటోంది.గతంలో ఏ సీరియల్ కు లేని విధంగా కార్తీకదీపం సీరియల్ మంచి టీఆర్పీ రేటింగ్ లను సొంతం చేసుకుంటూ కొత్త రికార్డులను క్రియేట్ చేయడం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube