‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్ హీరో గురించి ఈ విషయాలు మీకు తెలుసా?  

prema yentha madhuram serial hero-real life story prema yentha madhuram serial, zee telugu, arya vardhan, venkat sriram - Telugu Arya Vardhan, Prema Yentha Madhuram Serial, Venkat Sriram, Zee Telugu

ప్రస్తుతం నడుస్తున్న సీరియల్ లో జరిగే కథలకి కొంత విభిన్నంగా.ప్రేమకు వయస్సుకు, సంబంధం లేకుండా వస్తున్న సీరియల్ ప్రేమ ఎంత మధురం.

TeluguStop.com - Prema Yentha Madhuram Serial Hero Real Life Story

ఈ సీరియల్ లో హీరోగా నటిస్తున్న వెంకట్ శ్రీరామ్ (ఆర్య వర్ధన్) ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంటున్నారు. ఆర్య వర్ధన్ నిజ జీవితం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అతని అసలు పేరు వెంకట్ శ్రీరామ్.అమలాపురంలో 1976 జూన్ 19న జన్మించారు.

TeluguStop.com - ప్రేమ ఎంత మధురం’ సీరియల్ హీరో గురించి ఈ విషయాలు మీకు తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అతను తన విద్యను కూడా అమలాపురం లోనే పూర్తి చేశారు.

తనకు పెళ్లై ఒక బాబు కూడా ఉన్నాడు.

ఇంతవరకు తన కుటుంబంను ప్రేక్షకులకు పరిచయం చేయకపోవడానికి కారణం.అతను సోషల్ మీడియాకు దూరంగా ఉండడం.

తన విద్యానంతరం తన కుటుంబంతో పాటు హైదరాబాద్ లో నివాసం ఉంటున్నాడు.కానీ శ్రీరామ్ కు నటన మీద ఆసక్తి ఎక్కువగా ఉండటంతో మొదటగా ఈటీవీలో ప్రసారమయ్యే “విధి” సీరియల్ తో బుల్లితెర నటుడిగా ప్రత్యక్షమయ్యారు.

తొలి పరిచయంతోనే ఈ సీరియల్ లో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు.అలాగే కొన్ని ఛానల్ లో వచ్చే తెలుగు సీరియల్ ఎగిరే పావురమా, రాధాకళ్యాణం, దామిని ఇంకెన్నో సీరియల్లో బుల్లితెర నటుడిగా నటించాడు.

బుల్లితెరపై నటిస్తుండగానే సినిమాల్లోకి పరిచయమయ్యాడు.బొమ్మరిల్లు, శతమానంభవతి మరిన్ని చిత్రాల్లో మంచి పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

ఇది ఇలాగ ఉండగా నటుడిగా తనకి ఎన్నో అవకాశాలు వస్తున్నా… తనకు ప్రొడక్షన్ పై ఉన్న ఆసక్తితో జీ తెలుగులో ప్రసారమయిన వరూధిని పరిణయం, కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్లకు ప్రొడ్యూస్ ర్ గా చేశారు.ప్రస్తుతం ప్రసారమవుతున్న కల్యాణ వైభోగంపై ప్రొడ్యూస్ చేస్తున్నారు.

అంతేకాకుండా కన్నడ సీరియల్స్ లో కూడా శ్రీరామ్ నటిస్తున్నారు.తనకు నటనలో పది సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.

ఈటీవీ, జెమిని, జీ తెలుగు, మా టీవీ చానల్లో నటిస్తుంటారు.అంతేకాకుండా కొన్ని ప్రోగ్రామ్స్ లకు కూడా యాంకరింగ్ చేశారు.

తను ప్రకటనలను కూడా చేశారు.ఇలా తన జీవితమును నటన తో ప్రేక్షకులకు పరిచయమయ్యారు.

#Arya Vardhan #Venkat Sriram #PremaYentha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Prema Yentha Madhuram Serial Hero Real Life Story Related Telugu News,Photos/Pics,Images..