'ప్రీల్యూడ్ ఆఫ్ పుష్పరాజ్' పేరుతో గ్లిమ్స్ వదిలిన సుకుమార్..!

సైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప.ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.

 Prelude Of Pushpa Raj Out Now, Prelude Of Pushpa Raj, Pushpa, Allu Arjun, Rashmi-TeluguStop.com

అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా తర్వాత చేస్తున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.అల్లు అర్జున్ తన కెరీర్ లో మొదటి సారి పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాలో అల్లు అర్జున్ ఎర్ర చందనం స్మగ్లర్ గా నటిస్తున్నాడు.రష్మిక మందన్న ఒక గిరిజన యువతిగా నటిస్తుంది.ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు సుకుమార్ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.ఫస్ట్ లుక్ ఒక్కటే విడుదల చేసారు.

అయితే ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భం గా స్పెషల్ గిఫ్ట్ ఉంటుందని ఎప్పటి నుండో టాక్ వస్తుంది.

అయితే దీనికి సంబంధించి మేకర్స్ అనౌన్స్ కూడా చేసారు.అయితే ఈ రోజు ప్రీల్యూడ్ ఆఫ్ పుష్పరాజ్ పేరుతో 18 సెకన్ల నిడివి ఉన్న ఒక వీడియోను మేకర్స్ విడుదల చేసారు.ఈ వీడియో లో అల్లు అర్జున్ చేతులు వెనక్కి కట్టేసి ఉన్నాయి.

ముఖానికి ముసుగుతో ఉన్న అల్లు అర్జున్ అడవిలో పరిగెత్తుతూ కనిపించాడు.ఈ గ్లిమ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ స్థాయిలో తెర కెక్కిస్తున్నారు.మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతుంది.ఈ సినిమా లో స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా నటిస్తుంది.

ఈ సినిమా ను శరవేగంగా పూర్తి చేసి స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఆగస్టు 13 న విడుదల చేయాలనీ భావిస్తున్నారు.

https://youtu.be/gbcpEbr6ECA

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube