ఆ షార్ట్ రన్ నిర్ణయం తనని తీవ్రంగా దెబ్బతీసిందంటూ ఫైర్ అయిన ప్రీతిజింటా…!  

Preity Zinta on controversial short-run call in KXIP vs DC, Preity Zinta, KXIP vs DC,Short Run Call, BCCI, KXIP - Telugu Bcci, Coronavirus, Delhi Capitals, Home Quarantine, Ipl2020, Kings Xi Punjab, Kxip, Kxip Vs Dc, Preity Zinta, Short Run Call

నిన్న ఎంతో రసవత్తరంగా సాగిన ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ లో తప్పుడు నిర్ణయం కారణంగా కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు ఓడింది అనే చెప్పవచ్చు.ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ మొదలుపెట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు మాత్రమే చేయగలిగింది.

TeluguStop.com - Preity Zinta Short Run Call Kxip Vs Dc Bcci Rules

ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు కూడా 8 వికెట్లను కోల్పోయి 157 పరుగులు చేయగలిగింది.దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్ కి దారి తీసింది.

సూపర్ ఓవర్లలో మొదటగా బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవన్ జట్టు కేవలం 2 పరుగులు మాత్రమే చేసి, 2 వికెట్లను కోల్పోయింది.దీంతో కేవలం మూడు పరుగుల లక్ష్యంతో దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ మూడు బంతుల్లో మూడు పరుగులు మాత్రమే చేసి విజయాన్ని అందుకుంది.ఇక మ్యాచ్ డ్రాగా అయ్యే ముందు పంజాబ్ ఛేదన చేస్తున్న సమయంలో 19వ ఓవర్లో ఫీల్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వివాదంగా మారింది.19వ ఓవర్లో మూడు బంతిని బ్యాట్స్మెన్ ఎక్స్ట్రా కవర్ డ్రైవ్ వైపు ఆడి రెండు పరుగులు తీశారు.అయితే ఇందులో ఆన్ ఫీల్డ్ అంపైర్ పేరు మాత్రం మొదటి పరుగును షాట్ రన్ నిర్ణయం తీసుకున్నాడు.అయితే టీవీ రిప్లై లో మాత్రం ఆ పరుగు పూర్తి చేసినట్టుగా క్లియర్ గా కనబడింది.

TeluguStop.com - ఆ షార్ట్ రన్ నిర్ణయం తనని తీవ్రంగా దెబ్బతీసిందంటూ ఫైర్ అయిన ప్రీతిజింటా…-General-Telugu-Telugu Tollywood Photo Image

నిజానికి ఈ నిర్ణయంతో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఓడిపోయిందని చెప్పవచ్చు.

ఇందుకు సంబంధించి కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు ఓనర్ ప్రీతిజింటా ట్విట్టర్ వేదికగా బీసీసీఐ పై ఫైర్ అయ్యింది.

తాను కరోనా నుండి సంతోషంగా జయించానని, 6 రోజులు హోమ్ క్వారంటైన్, 5 కోవిడ్ పరీక్షలు పూర్తి చేసుకున్నాని తెలియజేసింది.అయితే ఇవేవి నన్ను బాధించలేదని…కాకపోతే, ఆ ఒక్క షాట్ రన్ విషయం మాత్రం తనను ఇంత తీవ్రంగా దెబ్బతీసిందని తెలియజేసింది.

ప్రస్తుతం ఇంత టెక్నాలజీ ఉన్న దానిని ఉపయోగించకపోవడం ఏంటి అంటూ బీసీసీఐ పై ఫైర్ అయ్యింది.బిసిసిఐ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టాల్సిన సమయం ఆసన్నమైందని, దాంతో ప్రతి సంవత్సరం ఇలా జరగదంటూ ట్వీట్ చేసింది.

ఇక మరొక ట్వీట్ చేస్తూ… నేను ఎప్పుడు ఆటలోని గెలుపోటములను సమానంగా స్వీకరిస్తానని… అయితే ఆటలో మరిన్ని మార్పులు, అలాగే నిబంధనల్లో మరికొన్ని జత చేయాలని ఆవిడ బిసిసిఐ కి సూచించింది.

#KXiP #BCCI #Home Quarantine #Delhi Capitals #Kings Xi Punjab

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Preity Zinta Short Run Call Kxip Vs Dc Bcci Rules Related Telugu News,Photos/Pics,Images..