ఆ హీరోయిన్ తన అక్కగా నటించేందుకు భయపడిందట... దాంతో కాజల్ ...

తెలుగులో ప్రముఖ దర్శకుడు జెఫ్రీ గి చిన్ మోసగాళ్ళు అనే చిత్రానికి దర్శకత్వం వహించిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో మంచు విష్ణు హీరోగా నటించగా హీరో అక్క పాత్రలో కాజల్ అగర్వాల్, ఇతర పాత్రలలో యంగ్ హీరో నవదీప్, నవీన్ చంద్ర, సీనియర్ హీరో జగపతి బాబు తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.

 Preity Zinta Is First Choice Is In Mosagallu Kajal Agarwal Role-TeluguStop.com

అయితే ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా మంచు విష్ణు ప్రెస్ మీట్ లో పాల్గొని ఈ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.

ఇందులో భాగంగా మొదటగా ఈ చిత్రంలో తన అక్క పాత్రలో నటించిన కాజల్ అగర్వాల్ స్థానంలో బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ ప్రీతి జింటా ని నటింపజేయాలని అనుకున్నట్లు తెలిపాడు.

 Preity Zinta Is First Choice Is In Mosagallu Kajal Agarwal Role-ఆ హీరోయిన్ తన అక్కగా నటించేందుకు భయపడిందట… దాంతో కాజల్ …-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ అనివార్య కారణాల వల్ల ఆమె ఈ చిత్రంలో నటించడానికి అంగీకరించలేదని దాంతో కాజల్ అగర్వాల్ కి ఈ కథను చెప్పడంతో ఆమె వెంటనే ఓకే చేసిందని చెప్పుకొచ్చాడు.అంతేగాక టాలీవుడ్ సినిమా పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న కాజల్ అగర్వాల్ తనకి అక్క పాత్రలో నటించినందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని మరియు ఓ స్టార్ హీరోయిన్ అక్క పాత్రలో నటించాలంటే చాలా ఆలోచిస్తారని కానీ కాజల్ అగర్వాల్ తన కోసం ఏమీ ఆలోచించకుండా ఈ చిత్రంలో నటించడానికి ఒప్పుకుందని అందుకు ధన్యవాదాలు కూడా తెలిపాడు.

అలాగే ఈ చిత్రంలో ప్రతి ఒక్కరు కూడా తమ పాత్రలకి 100% న్యాయం చేశారని అందుకు పేరు పేరునా చిత్ర యూనిట్ సభ్యులకి కృతజ్ఞతలు తెలియజేశాడు.అంతేకాక అప్పట్లో అక్క తమ్ముడు కలిసి చేసిన స్కామ్ అనే వాస్తవిక సంఘటన ద్వారా ఈ చిత్రాన్ని తెరకెక్కింఛామని కాబట్టి కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశా భావం వ్యక్తం చేసాడు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ చిత్రం మార్చి 19వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.ఇటీవలే ఈచిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల కాగా మంచి స్పందన లభించింది.

అంతేగాక ఈ చిత్రాన్ని చూసిన కొందరు సినిమా సెలబ్రిటీలు కూడా మంచు విష్ణు కి అభినందనలు తెలియజేస్తున్నారు.దీంతో ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అలాగే ఈ చిత్రం దాదాపుగా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, తదితర నాలుగు భాషలలో ప్రసారం కానుంది.పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేసిన మంచు విష్ణు ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటాడు చూడాలి.

#MosagalluMovie #Manchu Vishnu #KajalROle #Kajal Agarwal #PreityZinta

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు