ఆ రోజు ఆమె పరీక్ష రాస్తుంటే తిట్టారు, చచ్చిపోతావన్నారు, పురిటి నొప్పులతో ఆమె రాసిన పరీక్ష జీవితాన్ని మార్చేసింది  

Pregnant Women Attend Dsc Exam, Blessed A Baby Boy-

అవసరం ఎంత పనైనా చేసేలా చేస్తుంది.పట్టుదల ఎంతటి కష్టం అయినా పడేలా చేస్తుంది.జీవితంలో ఏదైనా లక్ష్యంతో ముందుకు వెళ్తున్న సమయంలో దానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఏ ఒక్కటి కూడా దరి చేరకుండా ముందుకు వెళ్లాలనిపిస్తుంది.అలా అన్ని ఒడుదొడుకులను ఎదుర్కొన్నప్పుడే అద్బుతమైన విజయం సొంతం అవుతుంది.కష్టాలను, బాధలకు భయపడి వద్దులే అనుకుంటే ముందు ఉన్న విజయం చేరువ కాకుండానే వెళ్లి పోతుంది.

Pregnant Women Attend Dsc Exam, Blessed A Baby Boy--Pregnant Women Attend Dsc Exam Blessed A Baby Boy-

తాజాగా ఏపీకి చెందిన స్వాతి పట్టుదలతో తాను అనుకున్నది సాధించి నలుగురికి ఆదర్శప్రాయంగా నిలిచింది.

Pregnant Women Attend Dsc Exam, Blessed A Baby Boy--Pregnant Women Attend Dsc Exam Blessed A Baby Boy-

స్వాతి ఏపీ డీఎస్సీ పరీక్ష రాసి టీచర్‌ జాబ్‌ను పొందింది.ఎగ్జామ్‌ రోజు ఆమె పడ్డ వేదన గురించి తాజాగా చెప్పుకొచ్చిన స్వాతి కన్నీరు తెప్పించింది.

నిండు గర్బినిగా ఉన్న సమయంలో పరీక్ష వచ్చింది.ఎప్పటి నుండో వెయిట్‌ చేస్తున్న పరీక్ష, ఈ పరీక్ష రాయకుంటే మళ్లీ డీఎస్సీ ఎప్పటికి పడుతుందో కూడా తెలియదు.అందుకే పట్టుదలతో ఆ పరీక్ష రాయాలని నిర్ణయించుకుంది.గర్బవతి అయినా కూడా రోజుకు కనీసం పది గంటలకు తగ్గకుండా చదివింది.బాగా చదివింది, ఎగ్జామ్‌ రోజు రానే వచ్చింది.ఆ రోజు ఆటోలో ఎగ్జాక్‌ కు వెళ్తుంది.ఆ సమయంలోనే నొప్పులు మొదలు అయ్యాయి.

తల్లితో పాటు ఆటోలో స్వాతి ఎగ్జామ్‌ హాల్‌కు చేరుకుంది.తల్లికి నొప్పుల విషయం చెప్పకుండా ఉండాలని ప్రయత్నించింది.కాని ఆ నొప్పుల తీవ్రత వల్ల తల్లికి తెలిసింది.వెంటనే హాస్పిటల్‌కు వెళ్దాం అంటూ బతిమిలాడినది.అక్కడకు వచ్చిన వందలాది మంది కూడా ఆమెను తిట్టి మరీ హాస్పిటల్‌కు వెళ్లమన్నారు.

కాని ఆమె మాత్రం తన తండ్రి కోరిక, తన తండ్రి బాధను తీర్చేందుకు ఆ పరీక్ష రాయాలని గట్టి పట్టుదలగా ప్రయత్నించింది.అనుకున్నట్లుగానే రెండున్నర గంటలు అత్యంత కష్టమీద ఆమె పరీక్ష రాసింది.పరీక్ష రాసిన వెంటనే హాస్పిటల్‌కు తరలించారు.అంతకష్టపడి రాసినందుకు గాను స్వాతికి ప్రభుత్వ ఉద్యోగం లభించింది.

కుటుంబం మొత్తం ఇప్పుడు చాలా సంతోషంగా ఉందని, ఆ రోజు పడ్డ కష్టంకు జీవితాంతం సంతోషంను నేను అనుభవిస్తాను అంటూ స్వాతి చెబుతోంది.లక్ష్య సాధనలో ఎదురయ్యే ఇబ్బందులను ఎదుర్కొని ముందుకు వెళ్లినప్పుడే విజయాలు సాధ్యం అవుతాయని స్వాతి అనుభవంతో చెబుతోంది.