భార్యను కూల్ చేయడానికి కిస్ ఇవ్వబోయాడు..వెంటనే నాలుక కొరికేసింది..     2018-09-24   10:15:44  IST  Rajakumari K

భర్తపై కోపం ఉంటే సాధారణంగా భార్యలు ఏం చేస్తారు అలిగి మాట్లాడడం మానేస్తారు..కోపం ఎక్కువైతే కిచెన్ లో గిన్నెలు దబదబా ఎత్తేస్తారు..ఈ సిగ్నల్స్ ని బట్టి తన కోపాన్ని అంచనావేయోచ్చు ..కోపాన్ని తగ్గించడానికి భర్తలు ఉపయోగించే మెయిన్ మంత్రం మౌనంగా ఉండడం.. ఇందుకు భిన్నంగా భార్యని కూల్ చేద్దామని ముద్దు ఇవ్వబోయాడు ఒక భర్త..అంతే కట్ చేస్తే ఇద్దరూ పోలీస్ స్టేషన్లో ఉన్నారు..ఇంతకీ ముద్దు ఇవ్వడం భర్త చేసిన తప్పా.. అసలు ఏం జరిగింది..

న్యూఢిల్లీ పరిధిలోని రణహోలా ప్రాంతంలో భార్యతో కలిసి నివసిస్తున్నాడు కరణ్ అనే వ్యక్తి…వృత్తి రిత్యా ఆర్టిస్టు…..భార్యాభర్తల మధ్య పెళ్లైనప్పటి నుండి సఖ్యత లేదు..నిత్యం ఏవో గొడవలు..చుట్టుప్రక్కల వారికి డిస్టబెన్స్.. కరణ్ భార్య ఇప్పుడు ఎనిమిదో నెల ప్రెగ్నెంట్..పిల్లలు పుడితే అయినా ఇద్దరూ సర్దుకుంటారని ఇరువైపులా కుటుంబ సభ్యుల భావించారు..ఈ క్రమంలో ఒక రోజు రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చాడు కరణ్ .అప్పటికే చాలా సార్లు ఫోన్లు చేసి చేసి విసిగిపోయిన భార్య,అతడు రాగానే గొడవకు దిగింది.ఎందుకు ఆలస్యం అయిందో రీజన్ చెప్తున్న వినిపించుకోకపోవడంతో.. భార్య కోపాన్ని చల్లార్చేందుకు ఓ లిప్ కిస్ ఇచ్చాడు కరణ్..అంతే..

Pregnant wife cut Husband tongue while doing Kiss-Husband Tongue,Kajal Singh,Karan Singh,pregnant Wife

అప్పటికే ఆగ్రహంతో ఊగిపోతున్న భార్య, అదే అదనుగా భావించి తన దగ్గరకు వచ్చిన భర్త నాలుకను చటుక్కున కొరికేసి, తనలోని కోపాన్ని తీర్చుకుంది.నాలుక తెగిపోవడంతో పరుగుపరుగున సఫ్టర్ జంగ్ ఆసుపత్రికి వెళ్లాడు. కరణ్ నాలుకకు వైద్యులు శస్త్రచికిత్స చేసారు. అయితే ప్రస్తుతం అతను మాట్లాడలేకపోతున్నాడు. తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైట్ ఇచ్చాడు..కరణ్ ఫిర్యాదు మేరకు భార్యపై ఐపీసీ సెక్షన్ 326 కింద కేసు నమోదు చేశారు పోలీసులు..ఎంత కోపం ఉంటే మాత్రం నాలుక కొరికేయడం ఏంటో..ఇకపై కోపంలో భార్యకు ముద్దివ్వడానికి భర్తలు సాహసం చేయరేమో..