జులై 27... 2018 చంద్ర గ్రహణం రోజు గర్భిణీ స్త్రీలు ఎలాంటి పనులు చెయ్యకూడదు...చేస్తే ఏమవుతుంది  

  • జులై 27 2018 ఆషాడ శుద్ధ పౌర్ణమి రోజున ఉత్తరాషాఢ,శ్రావణ నక్షత్రాలలో మకర రాశిలో ఏర్పడే సంపూర్ణ చంద్ర గ్రహణం ఏ రాశులకు ఇబ్బంది కలిగిస్తుందో తెలుసుకుందాం. ఉత్తరాషాఢ,శ్రావణ నక్షత్రాలు,మకర రాశి వారికీ తీవ్రమైన ఇబ్బందులను కలిగిస్తుంది. ఈ నక్షత్రాలలో కానీ ఈ రాశిలో గాని గర్భిణీ స్త్రీలు ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా లేకపోతే కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. గర్భిణీ స్త్రీలు గ్రహణం సమయానికి అరగంట ముందు వరకు కూడా తినవచ్చు,ద్రవ పదార్ధాలు త్రాగవచ్చు.

  • అయితే గ్రహణ సమయంలో చలనం లేకుండా పడుకోవటం మంచిది. గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో ప్రశాంతంగా పడుకోవటం కానీ దైవ నామ స్మరణ చేయటం కానీ చేస్తే గర్భిణీ స్త్రీలకు మరియు కడుపులో పెరుగుతున్న శిశువుకు చాలా మంచిది. గర్భిణీ స్త్రీలు మకర రాశి వారు అయితే అనవసరంగా తిరగకూడదు, అనవసరంగా ఆహార పదార్ధలను తినకూడదు,అనవసరంగా పనికిరాని విషయాలను మాట్లాడకూడదు.

  • Pregnant Ladies Precautions On Grahan-

    Pregnant Ladies Precautions On Grahan

  • కానీ ఆలా కాకుండా చేస్తే విపరీతమైన చర్యలు,బుద్ది కలిగిన వారు పుట్టే అవకాశం ఉంది. అందువల్ల గ్రహణ సమయంలో తిరగకుండా ప్రశాంతంగా ఉంటే పుట్టే సంతానం బాగుంటుంది. గర్భధారణ సమయంలో గర్భిణీ స్త్రీలు తిరగటం వలన కడుపులో ఉన్న శిశువు కదలికలు విపరీతంగా పెరుగుతాయి. ఈ విధంగా శిశువు కదలికలు ఎక్కువగా ఉంటే ఉమ్మనీరు తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గ్రహణ సమయంలో ప్రతి గర్భిణీ స్త్రీ వెల్లికిలా పడుకొని భగవంతుని నామ స్మరణ చేయటం మంచిది.

  • మకర రాశి వారు అయితే ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు విష్ణు సహస్ర నామాలు,లలిత సహస్ర నామాలు వినటం,మంచి మాటలను మాట్లాడటం వంటివి చేస్తే మంచి సంతానం కలుగుతుంది. 12 రాశుల గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో ఇప్పుడు చెప్పిన జాగ్రత్తలు పాటించాలి. గర్భిణీ స్త్రీలు గ్రహణం మధ్య సమయంలో బ్రాహ్మణుడికి రాగి పాత్రలో నీరు, ఒక కంచు పాత్రలో నెయ్యి వేసి దానం ఇవ్వాలి. ఇలా దానం ఇవ్వటం వలన వారి నక్షత్రం,రాశిలో ఏమైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి.