సంతోషంతో స్వదేశానికి సిద్ధమై.. అంతలోనే విషాదం: సౌదీలో భారతీయ గర్బిణీ మృతి

లాక్‌డౌన్ కారణంగా ప్రవాస భారతీయులు ఎక్కడికక్కడ చిక్కుకుపోవడంతో వారి బాధ వర్ణనాతీతం.రవాణా సౌకర్యాలు నిలిచిపోవడంతో ఏం చేయాలో, ఎవరికి చెప్పుకోవాలో తెలియక విమానాశ్రయాల్లోనో, భారత రాయబార కార్యాలయాల్లో పలువురు భారతీయులు బిక్కుబిక్కుమంటూ గడిపారు.

 Pregnant Indian Nri Woman Dies In Jeddah While Waiting To Be Repatriated, Jeddah-TeluguStop.com

అయితే కేంద్రప్రభుత్వం వివిధ దేశాల్లో చిక్కుకున్న ఎన్ఆర్ఐలను స్వదేశానికి తీసుకొచ్చేందుకు వందే భారత్ మిషన్ పేరుతో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఎన్నో రోజుల తర్వాత భారతదేశానికి వెళ్లే అవకాశం రావడంతో ఎగిరి గంతేసిన ఓ నిండు గర్భిణీ దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయింది.

కేరళ రాష్ట్రం మలప్పురం జిల్లా తిరురంగడిలోని కుందూరుకు చెందిన జసిరా ఆమె భర్త ఉల్లక్కం తాయిల్‌ సౌదీ అరేబియాలోని జెద్దాలో నివసిస్తున్నారు.జసిరా (27) నిండు గర్బిణీ కావడంతో భారత్‌లోని తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లాలని భావించింది.

అయితే భారతదేశంతో పాటు సౌదీ అరేబియాలోనూ కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో ఇరు దేశాల్లోనూ లాక్‌డౌన్ విధించారు.దీంతో స్వదేశానికి వెళ్లాలని భావించిన జసిరాకు నిరాశే ఎదురైంది.

రోజులు గడుస్తున్న నేపథ్యంలో భారత్‌కు వెళ్లలేనేమోనని తీవ్ర నిరాశలో కూరుకుపోయిన ఆమెకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వందే భారత్ మిషన్ ఆనందాన్ని కలిగించింది.దీనిలో భాగంగా స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు తన పేరును ఇండియన్ ఎంబసీలో జసిరా రిజిస్టర్ చేరుకున్నారు.

భారత్‌కు వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న ఆమె బుధవారం అనారోగ్యానికి గురవ్వడంతో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.

దీంతో జసిరా కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.జసిరా, ఆమె భర్త అనాస్ ఉల్లక్కం తాయిల్ దంపతులకు నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube