గర్భంతో ఉన్న ప్రేయసిని గడ్డకట్టే చలిలో?

గర్భందాల్చిన మహిళల పట్ల కుటుంబసభ్యులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.వారికి ఎలాంటి సమస్య రాకుండా తగినన్ని జాగ్రత్తలు పాటిస్తూ, కడుపులో పెరిగే బిడ్డకు ఏ సమస్య లేకుండా వారిని జాగ్రత్తగా చూసుకుంటారు.

 Pregnant Girlfriend In The Freezing Cold-TeluguStop.com

వారి ఆరోగ్యం గురించి ఎన్నో జాగ్రత్తలు పాటిస్తారు.అలాంటిది కేవలం పందెం నెగ్గడం కోసం గర్భందాల్చిన తన ప్రేయసిని గడ్డకట్టే చలిలో బయట ఉంచి తన ప్రాణాలను తీసిన ఘటన రష్యాలో చోటుచేసుకుంది.

వాతావరణంలో మార్పులు సంతరించుకోవడం వల్ల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.ఈ చలికి సాధారణ మనుషులే గజగజా వణుకుతున్నారు.ఈ చలి తీవ్రత నుంచి కాపాడుకోవడానికి ఉన్ని దుస్తులను ధరిస్తూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.అలాంటిది గర్భందాల్చిన ఓ మహిళను వంటిపై దుస్తులు లేకుండా కేవలం బికినీతో ఇంటి బాల్కనీలో రాత్రి నిలబెట్టాడు ఓ ప్రియుడు.

 Pregnant Girlfriend In The Freezing Cold-గర్భంతో ఉన్న ప్రేయసిని గడ్డకట్టే చలిలో-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదంతా కేవలం తన స్నేహితుడితో పందానికి ఆమె ప్రియుడు ఒప్పుకోవడంతో ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు.
గర్భంతో ఉన్న అతని ప్రియురాలిని బాల్కనీలో బయట నిల్చో పెడితే అతనికి1300 డాలర్లు(రూ.96వేలు) ఇస్తానని తన స్నేహితుడు సవాల్ చేయడంతో అందుకు ఆ ప్రియుడు బికినీతో ఉన్న తన ప్రేయసిని బాల్కనీలోకి నెట్టేసి లోపల గదిలో గడియ పెట్టుకున్నాడు.అసలే చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆ చలికి తట్టుకోలేక తలుపులు తీయమంటూ అతడిని బతిమిలాడినా తలుపులు తీయలేదు.

చివరకు ఆ మహిళ చలికి తట్టుకోలేక ఒక్కసారిగా బాల్కనీలో కుప్పకూలిపోయింది.

వాలంటీనా గ్రిగర్‌యేవా అనే మహిళ ఆ చలి తీవ్రతను తట్టుకోలేక దాదాపు 15 నిమిషాల పాటు ఆ చలిలో తీవ్ర నరకం అనుభవించి కింద పడిపోయింది.

కింద పడిన ఆమెను గుర్తించిన తన ప్రియుడు స్టాస్‌ రీఫ్లే ఆమెను వెంటనే గదిలోకి తీసుకు వచ్చాడు.అయితే అప్పటికే ఆలస్యం కావడంతో ఆమె మరణించింది.

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు స్టాస్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.అతని సరదాల కోసం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నందుకుగాను స్టాస్‌ రీఫ్లేకి దాదాపు రెండు సంవత్సరాల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

#BetBetween #Rs.96000 Bet #PregnantIn

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు