నా ఎదుగుదలని అడ్డుకోవాలని ప్రయత్నించారు అంటున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్  

Preeti Jhangiani Comments on groupism, Nepotism, Bollywood, B-town, Bollywood Mafia - Telugu B-town, Bollywood, Bollywood Mafia, Nepotism, Preeti Jhangiani Comments On Groupism

పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకి చేరువ అయిన బాలీవుడ్ నటి ప్రీతీ జింగ్యానీ.ఈ అమ్మడు తెలుగులో చేసిన సినిమాలు తక్కువే అయిన మంచి గుర్తింపు తెచ్చుకుంది.

TeluguStop.com - Preeti Jhangiani Comments On Groupism

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

బాలీవుడ్ లో మాత్రం స్టార్ హీరోలతో జత కట్టి పెద్ద హీరోయిన్ అయ్యింది.  తరువాత హీరోయిన్స్ కాంపిటేషన్ లో ఈ అమ్మడు వెనుకబడిపోయింది.

TeluguStop.com - నా ఎదుగుదలని అడ్డుకోవాలని ప్రయత్నించారు అంటున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్-Movie-Telugu Tollywood Photo Image

అయితే దశాబ్దం పాటు బాలీవుడ్ హీరోయిన్ గా మంచి హవా కొనసాగించింది.పెద్ద పెద్ద స్టార్స్ తో రొమాన్స్ చేసింది.

ఇదిలా ఉంటే బాలీవుడ్ లో నెపోటిజం, మాఫియాపై పెద్ద ఎత్తున ప్రస్తుతం చర్చ నడుస్తుంది.ఈ నేపధ్యంలో ప్రీతీ జింగ్యానీ కూడా తన అనుభవాలని మీడియాతో పంచుకుంది.

మీడియా ఇంటర్వ్యూలో ఈ భామ మాట్లాడుతూ నువ్వు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నావనేది ఇక్కడ ముఖ్యం.ప్రతి రంగంలో గ్రూపిజం ఉంది.

నేను కొన్ని మల్టీస్టారర్ సినిమాలు చేశాను.ఆ టైమ్ లో నేను గ్రూపిజం ఎదుర్కొన్నాను.

కొన్ని గ్యాంగ్స్ నన్ను బాలీవుడ్ నుంచి నన్ను బయటకు తోసేయడానికి చూశాయి.నా ఎదుగుదలని అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేశారు.సెన్సిటివ్ గా ఉంటే ఇలాంటివన్నీ ప్రభావం చూపిస్తాయి.అయితే నేను మాత్రం వాటిని ఎక్కువగా పట్టించుకోలేదు.

కెమెరా ముందు కాన్ఫిడెంట్ గా ఉన్నాను.నా పని నేను చేసుకున్నాను.

  బాలీవుడ్ లో వందల మంది స్ట్రగుల్ అవుతుంటారు.ఒక్కరు మాత్రమే షారూక్ ఖాన్ అవుతారు.

ఎంతోమంది తమ ఆశల్ని నెరవేర్చుకునేందుకు ముంబయి వస్తుంటారు.అయితే ఎన్నో కష్టాలు  ఉంటాయి.

ఎన్నో చీత్కారాలు ఎదురవుతాయి.ఇందులోకి రాకముందే వీటన్నింటిపై అవగాహన ఉండి తీరాలి.

మరీ ముఖ్యంగా ప్రతి ఒక్కరికి బ్యాకప్ ప్లాన్ ఉండాలి.అది లేకపోతే బాలీవుడ్ లో బ్రతకడం కష్టం అని ప్రీతీ జింగ్యానీ చెప్పుకొచ్చింది.

మొత్తానికి అనుభవాలు నేర్పిన పాఠాలు ఈ రోజు కొత్తవాళ్లకి మార్గదర్శకం చేయడానికి ఇలాంటి సీనియర్ భామలకి ఉపయోగపడుతున్నాయి అనడంలో అతిశయోక్తి లేదు.ఏది ఏమైనా బాలీవుడ్ లో ఉన్న ఈ గ్రూపిజం కారణంగా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు అనేది వాస్తవం.

#B-Town #PreetiJhangiani #Nepotism

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Preeti Jhangiani Comments On Groupism Related Telugu News,Photos/Pics,Images..