అవకాశాల కోసం వెళితే కింది నుంచి పై వరకూ చూసేవాళ్ళంటున్న హీరోయిన్….   

Preeti Amin Chakravakam Serial Gemini Tv Tollywood Serial Casting Couch - Telugu Casting Couch, Chakravakam Serial, Gemini Tv, Preeti Amin, Producers And Diretcors, Tollywood Serial

అప్పట్లో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి జెమినీ టీవీలో ప్రసారమయ్యేటువంటి చక్రవాకం ధారావాహిక ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తుంటుంది.అయితే ఇందులో హీరోయిన్ గా నటించినటువంటి ప్రీతి అమీన్ తెలుగు ప్రేక్షకులకు తన అందం, అభినయంతో బాగానే దగ్గరయింది.

 Preeti Amin Chakravakam Serial Gemini Tv Tollywood Serial Casting Couch

అయితే చూడడానికి చక్కగా లక్షణంగా ఉన్నటువంటి ప్రీతి తెలుగులో అవకాశాలను మాత్రం దక్కించుకోలేకపోయింది.అయితే ఇటీవలే ప్రీతి ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూ లో పాల్గొంది.

ఇందులో భాగంగా తాను సినీ పరిశ్రమలో ఎదుర్కొన్న టువంటి కొన్ని సంఘటనలను ప్రేక్షకులతో పంచుతుంది.

అవకాశాల కోసం వెళితే కింది నుంచి పై వరకూ చూసేవాళ్ళంటున్న హీరోయిన్…. -Latest News-Telugu Tollywood Photo Image

అయితే ఇందులో భాగంగా మొదట్లో తాను సినిమా అవకాశాల కోసం తీవ్రంగా శ్రమించానని చెప్పుకొచ్చారు.

అయితే 2003వ సంవత్సరంలో చక్రవాకం సీరియల్ లో నటించే అవకాశం దక్కిందని ఈ సీరియల్ తనకు ఎంతో ఫేమ్ తెచ్చిపెట్టిందని తెలిపింది.చక్రవాకం సీరియల్ లో మంచి పేరు వచ్చినప్పటికీ పలు రకాల చిత్ర మరియు సీరియల్ షూటింగ్ ఆడిషన్లకి హాజరయ్యే దాన్నని కానీ దర్శక నిర్మాతలు యాక్టింగ్ కాకుండా ఇంకేం చేయగలవని అడుగుతూ పైకి కిందికి చూసే వాళ్ళని చాలాసార్లు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాని చెప్పుకొచ్చింది.

అందువల్ల ఒకానొక సమయంలో సినీ పరిశ్రమ నుంచి దూరంగా వెళ్లి పోవాల్సి వచ్చిందని తెలిపింది.

అయితే ప్రస్తుతం ఓ యూట్యూబ్ ఛానల్ ని రన్ చేస్తున్నారని అలాగే తన భర్త పిల్లలతో సంతోషంగా ఉన్నాన తెలిపింది.

అయితే ఇకపై తనకి నటించే ఉద్దేశం లేదని చెప్పుకొచ్చింది.ఏదేమైనప్పటికీ ఈ చక్రవాకం సీరియల్ మాత్రం అప్పట్లో తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

ఇందులో ఉన్నటువంటి పాత్రధారులు తెలుగు ప్రజలు తమ సొంత ఇంట్లో వాళ్ళ లాగా చూసేవాళ్లు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Chakravakam Serial Actress Preeti Amin Sensational Comments On Casting Couch Related Telugu News,Photos/Pics,Images..