ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ముత్యం..... విలువ ఎంతంటే!

‘ముత్యం’ అంటే ఇష్టపడని ఆడవారు ఉంటారు అంటే అతిశయోక్తి కాదేమో.ఎందుకంటే ముత్యం చూడగానే ఆడవారి మనస్సు రివ్వున లేచి మొహం లో ఆనందం వ్యక్తం అవుతుంది.

 Precious Pearl In The World-TeluguStop.com

అయితే ఈ ముత్యాల ఖరీదు ఎక్కువే ఉంటుంది కానీ మరీ 1,400 కోట్లకు పైగా ఒక ముత్యం ఖరీదు ఉంటుంది అని అంటే ఎవరైనా నమ్ముతారా.నిజంగా ప్రపంచంలోనే అతిపెద్ద ముత్యం, ఏకంగా 27 కిలోల బరువు కూడా ఉందట.అయితే ఈ ముత్యం ఖరీదు అక్షరాలా రూ.1,400 కోట్ల రూపాయలట.భీమా సంస్థలు ఈ ముత్యం ఖరీదు రూ.1400 కోట్లు ఉంటుంది అని అంచనా వేస్తున్నాయి.కెనడాకు చెందిన ఫిలిపినో అబ్రహం రియోస్ అనే వ్యక్తి వద్ద ఈ ముత్యం ఉందట.ఇది ఆయన అత్తగారి వారసత్వంగా ఆయన వద్దఉన్నట్లు తెలుస్తుంది.అయితే రెయెస్ తాత గారు 1950లో ఫిలిప్పీన్స్ లో ఒక భారీ ఆల్చిప్పను కొన్నారట.అయితే, ఆ ఆల్చిప్ప లోపల ఇంత పెద్ద ముత్యం ఉందని ఆయనకు తెలియదు.

కొన్నాళ్ల తరువాత ఈ ముత్యం బయటపడింది.అయితే ఈ ముత్యాన్ని రెయెస్ అమ్మడం లేదట.

అయితే ఈ అరుదైన ముత్యం ఉంది అన్న విషయం అందరికి తెలియాలని భావించిన రెయెస్ అందరూ చూడడానికి వీలుగా ఆ ముత్యాన్ని మ్యూజియం,గ్యాలరీ లకు పంపాలని నిశ్చయించుకున్నాడట.మొలస్కాజాతి జీవులు ఈ భారీ ఆల్చిప్పలో ఇరుక్కుపోవడం తో కొన్నాళ్లకు ముత్యం గా మారింది అని నిపుణులు భావిస్తున్నారు.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ము�

అయితే నిపుణుల ధ్రువీకరణ తరువాత దీని విలువను బీమా సంస్థలు లెక్కగట్టాయి.కెనడాకు చెందిన వారు దీని విలువను రూ.400 నుంచి రూ.600 కోట్ల మధ్య ఉంటుందని నిర్ధరించగా,హాంకాంగ్ చెందినవారు మాత్రం దీని విలువను రూ.వెయ్యి నుంచి రూ.1400 కోట్ల మధ్య ఉంటుందని నిర్ధారించారు.అయినా ఇంత ఖరీదైన ముత్యం కూడా ఉంటుంది అన్న విషయం ఎవరికీ తెలిసి ఉండదు.ఇప్పుడు ఇక ఈ ముత్యం గురించి తెలుసుకున్నాక ఆమ్మో ముత్యం విలువ ఇంత? అంత? అని ప్రశ్నించే వారికి ఆ ముత్యం లో ప్రత్యేకత ఏమిటి అనే విషయం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారేమో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube