వ్యవసాయంలో డ్రిప్ పద్ధతి( Drip method ) ద్వారా నీటిని అందించడం వల్ల పెట్టుబడి పెరగడమే కాకుండా నీరు అధికంగా వృధా అవ్వదు.అంతే కాకుండా ఎరువులను కూడా డ్రిప్ ద్వారా అందించడం వల్ల పంటలు ఆరోగ్యంగా పెరుగుతూ మంచి దిగుబడిని ఇస్తాయి.
ఇలా పంటకు నీటిని, ఎరువులను అందించడాన్ని ఫెర్టిగేషన్ అంటారు.చాలామంది రైతులకు ఫెర్టిగేషన్ పై సరైన అవగాహన లేకపోవడం వల్ల డ్రిప్ పరికరాలు దెబ్బతినడంతోపాటు మన్నిక తగ్గిపోతుంది.
డ్రిప్ విధానంలో పాటించాల్సిన జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాం.ఫర్టిలైజర్ ట్యాంక్ ( Fertilizer Tank )ద్వారా నీటిలో కరిగే ఎరువులను, నీటిలో కలిపి మొక్కలకు అందించడం వల్ల నీటితో పాటు ఎరువు కూడా భూమిలో ఇంకిపోయి వేరు వ్యవస్థకు పోషకాలు త్వరగా అందుతాయి.
సాధారణ పద్ధతిలో కంటే ఈ విధానంలో ఎరువుల వినియోగం రెండింతలు పెరుగుతుంది.

మొక్కలకు కావలసిన పోషకాలను ప్రతిరోజు నీటి పారుదల ద్వారా అందించడం వల్ల మొక్కలు ఆరోగ్యవంతంగా పెరిగి మంచి దిగుబడి ఇస్తాయి.అయితే ఈ ఫర్టిగేషన్ పట్ల కొంతమందికి సరైన అవగాహన లేకపోవడం, డ్రిప్ ద్వారా నీటిని అందించేటప్పుడు ప్రెషర్ గేజ్( Pressure Gauge ) లో సరైన ప్రెషర్ ఉండేటట్లు చూసుకోవడం వల్ల డ్రిప్ పరికరాలు పాడై అసలుకే మోసం వస్తుంది.

ఉద్యానవన తోటలకు, ఇతర పంటలకు ముందుగా కొంత నీటిని అందించి, కాసేపటి తర్వాత ఎరువును నీటిలో కలిపి అందించాలి.ఇలా చేయడం వల్ల తడిగా ఉన్న భూమి నుంచి ఎరువు నీరు మొక్క వేరు వ్యవస్థకు త్వరగా అందుతుంది.ఎరువు వృధా అయ్యే అవకాశం లేదు.
ప్రధాన పోషకాలు, సూక్ష్మ పోషకాలను కలపకుండా వేరువేరుగా అందించాలి.డ్రిప్ విధానం ద్వారా 30 శాతం వరకు నీరు ఆదా అవడంతో పాటు ఎరువులు నేరుగా వేరు వ్యవస్థకు అందడం, కలుపు సమస్య తగ్గడంతో రైతులకు పెట్టుబడి ( Investment )భారం తగ్గుతుంది.