ప్రీ ఓటర్ సర్వే...ట్రంప్ భవిష్యత్తు తేల్చేసిందిగా...!!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపు కోసం డెమోక్రటిక్ , రిపబ్లికన్ పార్టీలు హోరా హోరీ గా తలపడుతున్నాయి.కరోన కారణంగా ఎవరూ పోలింగ్ బూత్ వరకూ వచ్చి ఎన్నికలు వేయడానికి అమెరికన్స్ భయపడుతున్న నేపధ్యంలో ఈ సరి పోస్టల్ ద్వారా ఓట్లు వేయాలని మెజారిటీ ప్రజలు ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది.

 America Pre Voter Survey On President Elections, New York Times Square , Pre Vot-TeluguStop.com

న్యూయార్క్ టైమ్స్ సర్వే ప్రకారం అమెరికాలో సుమారు మూడు వంతుల మంది అంటే దాదాపు 80 మిలియన్ ప్రజలు పోస్టల్ ఓటుపైనే ఆసక్తిని చూపుతున్నారాట.ఇప్పటికే చాలా రాష్ట్రాలు కరోనా కారణంగా ప్రజలు అభీష్టం మేరకు పోస్టల్ ఓటింగ్ వైపు మొగ్గు చూపుతున్నాయని తెలుస్తోంది.ఇదిలాఉంటే

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ట్రంప్ కి ప్రజా మద్దతు తగ్గుతూ వస్తోందని అంటున్నాయి సర్వేలు.బడెన్ కి ఊహించిన దానికంటే కూడా ప్రజా మద్దతు పెరుగుతోందని జులై నుంచీ ఆగస్టు 12 వరకూ పోల్చుకుంటే దాదాపు 32 రకాల సర్వేలు వేరు వేరు ఫలితాలని చూపించాయట.

ఈ సర్వేలు అన్నిటిలో కూడా ట్రంప్ పై బిడెన్ గెలుపు ఖాయమే తేల్చాయని అంటున్నారు కానీ ఇద్దరి మధ్య గెలుపు ఓటముల శాతం కేవలం 5 శాతంగా ఉందని ఎన్నికల చివరివరకూ ఇవే లెక్కలు వేసుకోకూడదని నిపుణులు తెలిపారు.

ట్రంప్, బిడెన్ ల మధ్య జరిగిన పార్టీ సర్వేలో బిడెన్ కి 51 శాతం ఓట్లు, ట్రంప్ కి 41 శాతం గా నమోదవుతూ వచ్చాయట, దీన్ని బట్టి చూస్తే ఇద్దరి మధ్య 5 నుంచీ 10 శాతం తేడా మాత్రమే ఉందని తెలుస్తోంది.

ఇక డెమోక్రటిక్ పార్టీ నేతలు బిడెన్ కి 91 శాతం మంది మద్దతు తెలుపుతుంటే ట్రంప్ కి రిపబ్లికన్ పార్టీ నేతలు మాత్రం 87 శాతం మద్దతు తెలుపుతున్నారట.ఏ విధంగా చూసుకున్న ప్రీ ఓటర్ సర్వే ప్రకారం ట్రంప్ వెనుక పడ్డారని తెలుస్తోంది.

కానీ ఊహించని విధంగా ట్రంప్ ఎలాంటి వ్యూహాలు అనుసరించినా ఆ లెక్కలు మారిపోవచ్చని అంటున్నారు విశ్లేషకులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube