నాగ్ తో క్యాన్సిల్‌ చేసుకుని మెగా హీరోతో జత కట్టబోతున్న యంగ్ డైరెక్టర్‌

టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున త్వరలో వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఆ సినిమా పూర్తి అవ్వడమే ఆలస్యం దర్శకుడు ప్రవీణ్ సత్తార్ తో సినిమాను చేసేందుకు ఇప్పటికే కమిట్‌ అయ్యాడు.

 Praveen Sataar Cancel The Movie With Nagarjuna And Doing Movie With Varun Tej ,t-TeluguStop.com

వీరి కాంబో మూవీ అధికారికంగా ప్రకటన వచ్చేసింది.భారీ అంచనాల నడుమ రూపొందుతుందని ఖచ్చితంగా నాగార్జునతో ఒక విభిన్నమైన సినిమాను చేయబోతున్నట్లుగా దర్శకుడు ప్రవీణ్‌ సత్తార్‌ నమ్మకంగా చెప్పుకొచ్చాడు.

కాని ఇప్పుడు ఆ సినిమా క్యాన్సిల్‌ అయ్యిందేమో అంటూ వార్తలు వస్తున్నాయి.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రవీణ్‌ సత్తార్‌ కొత్త సినిమాను చేసేందుకు సిద్దం అయ్యాడు.

ఆ సినిమా చిత్రీకరణ కూడా మొదలు అవ్వబోతున్నట్లుగా చెబుతున్నాడు.అది ఎప్పుడు ఏంటీ అనే విషయంలో త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

మరి నాగార్జున సినిమా ఏంటి పరిస్థితి అంటే మాత్రం వారు ఏ క్లారిటీ ఇవ్వడం లేదు.

మెగా హీరో వరుణ్‌ తేజ్‌ ప్రస్తుతం ఎఫ్‌ 3 మరియు గని సినిమాలను చేస్తున్నాడు.

ఆ రెండు సినిమాలు కూడా చకచక పూర్తి అవుతున్నాయి.జూన్‌ వరకు రెండు సినిమాలు కూడా విడుదలకు సిద్దం అవుతాయి.

కనుక వరుణ్‌ తేజ్‌ మరో సినిమాను కూడా కమిట్‌ అయినట్లుగా సమాచారం అందుతోంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రవీణ్‌ సత్తార్ దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ సినిమా కోసం వరుణ్‌ తేజ్‌ ఓకే చెప్పాడు.

మొదట నాగార్జున సినిమా ఉంటుందా లేదంటే వరుణ్‌ తేజ్ తో ఈ యంగ్‌ డైరెక్టర్‌ సినిమా చేస్తాడా అనేది చూడాలి.వరుణ్‌ తేజ్ తో సినిమా విషయమై తుది చర్చలు కూడా పూర్తి అయ్యాయని అంటున్నారు.

అధికారిక ప్రకటన అతి త్వరలోనే వచ్చే అవకాశం ఉంది.ప్రవీణ్‌ సత్తార్‌ మరియు వరుణ్‌ తేజ్‌ ల సినిమా పూర్తిగా యూఎస్ లో తెరకెక్కనుందట.

కథ మొత్తం కూడా అక్కడే సాగుతుందని అంటున్నారు.బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube