క్షేత్ర స్థాయి వ్యూహంతో ప్రవీణ్ కుమార్ ఎత్తుగడ... సఫలమయ్యేనా?

తెలంగాణలో ఉన్న అందరు రాజకీయ పార్టీలు కెసీఆర్ టార్గెట్ గానే తమ రాజకీయ కార్యాచరణను రూపొందించుకుంటున్న పరిస్థితి ఉంది.ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్, వైయస్సార్ తెలంగాణ లాంటి పార్టీలు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ టార్గెట్ గా ముందుకెళ్తున్న పరిస్థితిల్లో ఇతర పార్టీలలా రాష్ట్ర స్థాయిలో భారీ విమర్శలతో కాకుండా క్షేత్ర స్థాయిలో బీఎస్పీ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తూ బడుగు బలహీన వర్గాల అభిప్రాయాలను వారి యొక్క సమస్యలను ప్రస్తావిస్తూ కెసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది.

 Praveen Kumar's Move With Field Level Strategy Successful Telangana Politics,-TeluguStop.com

  అయితే అందరిలా కాకుండా క్షేత్ర స్థాయిలో  బీఎస్పీని బలోపేతం చేయడం ద్వారా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అందరూ నేతలు మరల వచ్చేది ప్రజల దగ్గరికే.అప్పుడు బీఎస్పీ పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో టీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ తగిలే విధంగా ఒక బలమైన కార్యాచరణ, వ్యూహాత్మక ఎత్తుగడతో ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది.

అయితే కెసీఆర్ లాంటి అపర రాజకీయ మేధావికి ఈ రకమైన ఎత్తుగడలు అర్ధం కావా అంటే అర్ధమవుతాయి కాని వెంటవెంటనే స్పందిస్తే అది అసలు సిసలు రాజకీయం కాదుకదా.అన్ని అనుభవాలను ఆకళింపు చేసుకొని వాటిని తనదైన శైలిలో ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రతిపక్షాలను కొలుకోలేని దెబ్బ తీయడం కెసీఆర్ రాజకీయ విధానం అనేది మనకు తెలిసిందే.

Telugu @cm_kcr, Bjp, Bsp, Praveen Kumar, Telangana, Trs-Political

అయితే కెసీఆర్ లాంటి రాజకీయ మేధావిని తట్టుకొని ఇటీవల సివిల్ సర్వెంట్ గా వాలంటరీ రిటైర్ మెంట్ అయిన ప్రవీణ్ కుమార్ ప్రస్తుత రాజకీయాల్లో నిలబడగలడా అనేది ఒక పెద్ద ప్రశ్నగా మిగిలి ఉన్న పరిస్థితి ఉంది.అయితే ఎన్నికల సమయంలో బీఎస్పీ పార్టీ రాజకీయ విధానం ఎలా ఉంటుందన్నది మనం ఇప్పుడే చెప్పుకోలేకపోయినా అప్పటి పరిస్థితులను బట్టి ఏ పార్టీకి తమ నైతిక మద్దతు ఇస్తుందనేది చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube