ప్ర‌వీణ్‌కుమార్‌కు యూత్‌లో పెరుగుతున్న ఆద‌ర‌ణ‌.. రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం సృష్టిస్తారా..?

మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్.

 Praveen Kumar's Growing Popularity Among The Youth .. Will It Create A Sensation-TeluguStop.com

ప్రవీణ్ కుమార్‌ వీఆర్ఎస్ తీసుకుని రాజకీయాల్లోకి రాబోతున్నారన్న సంగతి అందరికీ తెలిసిందే.బహుజన సమాజ్‌వాదీ పార్టీలో ప్రవీణ్ కుమార్ చేరబోతున్నట్లు బీఎస్పీ అధినేత్రి మాయావతి ఇటీవల ప్రకటించింది.

ఈ క్రమంలోనే ప్రవీణ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించబోతున్నారా? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది.అయితే, మార్పును తీసుకొచ్చేందుకు ప్రవీణ్ కుమార్ తనవంతు ప్రయత్నం చేస్తారని స్వేరోస్, ప్రవీణ్‌ను అభిమానించే వారు చెప్తున్నారు.

బహుజనవాదం అనే అంశం నేటి రాజకీయాల్లో మాత్రమే కాదు గతంలోనూ చర్చనీయాంశంగా ఉండేది.కానీ, కాలక్రమేణా రాజకీయాల్లో వచ్చిన మార్పులు చర్చను వేరే తోవలో పోయేలా చేశాయి.

సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలల కార్యదర్శిగా ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ సేవల పట్ల సొసైటీలో మంచి అభిప్రాయమే ఉంది.ముఖ్యంగా యువతలో సామాజిక స్పృహను రగిలించారు ప్రవీణ్.

జ్ఞాన మార్గంలో పయనించడం ద్వారానే అట్టడుగున ఉన్న వర్గాల అభివృద్ధి జరుగుతుందని ప్రవీణ్ చెప్తున్నారు.విద్య, వైద్యం పట్ల శ్రద్ధ వహించాలనేది ప్రవీణ్ లక్ష్యం.

ఇక ఇప్పటికే తాను సాధించింది అతి తక్కువ మాత్రమేనని, రాజకీయాల్లోకి రావడం ద్వారా సాధించాల్సింది ఇంకా చాలా ఉందని ప్రవీణ్ పేర్కొంటున్నారు.

Telugu Craze, Entery Poltics, Ips, Maya Vathi, Activity, Praveen Kumars, Telenga

ఐపీఎస్ ఆఫీసర్‌గా సొసైటీని స్టడీ చేసిన ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ రాజకీయాల్లోకి రావడం మంచిదేనని రాజకీయ వర్గాల్లో ఉన్న మేధావులు, ఇతర పార్టీల నేతలు ఆహ్వానిస్తున్నారు.ఇంకా చెప్పాలంటే యూత్‌లో ఆయ‌న రావాల‌నే కోరిక చాలా బ‌లంగా మారుతోంది.ఆయన రావడం ద్వారా సొసైటీలో మార్పులను గమనించొచ్చని ఆకాంక్షిస్తున్నారు.అయితే, నిర్దిష్టంగా రాజకీయ కార్యచరణ రూపొందించుకుని యూత్‌ను అట్రాక్ట్ చేస్తూనే ప్రజల్లో మంచి ఆదరణ పొందితే రాజకీయంగా ప్రవీణ్ సక్సెస్ అయ్యే చాన్సెస్ ఉంటాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.కేవలం తెలంగాణలోనూ కాకుండా దేశవ్యాప్తంగా ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ రాజకీయ కార్యచరణ ఎలా ఉండబోతుందని ఎదురు చూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube