కేసీఆర్‌ను టార్గెట్ చేసిన ప్రవీణ్ కుమార్.. కారణమేంది బాస్..?

సాంఘిక సంక్షేమ గురుకులాల మాజీ కార్యదర్శి, మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్.ఎస్.

 Praveen Kumar Who Targeted Kcr  What Is The Reason Boss .praveen Kumar, Kcr , Ts-TeluguStop.com

ప్రవీణ్ కుమార్ తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారన్న సంగతి తెలిసిందే.అయితే, ఆయన అఫీషియల్‌గా బీఎస్పీ పార్టీలో ఇంకా చేరకపోయినా రాజకీయాల్లోకి వచ్చేసినట్లే.

ఈ క్రమంలో మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్ర సర్కారుపై విమర్శలు చేసిన ప్రవీణ్ తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్‌పైనే డైరెక్ట్ విమర్శలు చేశారు.ఈ విషయం సంచలనంగా మారింది.

ఆయన సీఎంను టార్గెట్ చేయడానికి గల కారణాలేంటో? అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

బహుజనవాదం అనే అంశం తెరమీదకు తీసుకొచ్చిన ప్రవీణ్ కుమార్ సొంత పార్టీ పెడతారని తొలుత అందరూ భావించారు.

కానీ, ఆయన బీఎస్పీలో చేరబోతున్నట్లు ఆ పార్టీ అధినేత్రి మాయావతి ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే.కాగా, ప్రవీణ్ కుమార్ రాజకీయంగా పదునైన వ్యూహాలను రచించుకున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే బహుజన ఎంప్లాయిస్‌తో సమావేశమవుతున్నారు.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పైనా పదునైన విమర్శలు చేస్తున్నారు.

ఫామ్ హౌజ్ నుంచి కేసీఆర్‌ను తరిమి కొట్టాలని పిలుపునివ్వడం ద్వారా టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా బలంగా పని చేయబోతున్నట్లు సంకేతాలిచ్చారు ప్రవీణ్.అయితే, బహుజనుల కోసం రాజకీయాల్లోకి వచ్చినట్లు పేర్కొంటున్న ప్రవీణ్.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను ఏకం చేసేందుకు ఎలాంటి వ్యూహాలను రచించబోతున్నారనేది చర్చనీయాంశమే.బహుజన వాదం అనే అంశం ద్వారా ఇప్పటికే పలు పార్టీలు ఉన్నప్పటికీ ఎలక్షన్ మేనేజ్‌మెంట్ ప్లస్ రాజ్యాధికారం సాధించడంలో అవి విఫలమయ్యాయి.

Telugu @cm_kcr, Bsp, Cm Kcr, Maya Vathi, Praveen Kumar, Trs, Ts Poltics-Telugu P

ఈ నేపథ్యంలో ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ రాజకీయ అధికారం సాధించడం కోసం ఎంత సీరియస్‌గా పని చేయనున్నారు? అనేది కొంత కాలం తర్వాత తేలుతుంది.తను రాజకీయ అధికారం మీద ఆశలు లేవని, బహుజనులను రాజకీయంగా అధికారంలోకి తీసుకురావడం కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని ప్రవీణ్ కుమార్ పేర్కొనడం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube