వ‌రుస మీటింగుల‌తో దూసుకుపోతున్న ప్ర‌వీణ్‌కుమార్‌.. ఆ వ‌ర్గాలే టార్గెట్‌

గురుకుల మాజీ కార్య‌ద‌ర్శి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ ఎస్ ప్ర‌వీణ్ కుమార్ బ‌హుజ‌న నినాదంతో రాజ‌కీయాల్లోకి వ‌చ్చి త‌న‌దైన స్టైల్‌లో ముంద‌కు సాగుతున్నారు.బ‌హుజ‌నుల‌కు రాజ్యాధికారం అనే వాదంతో ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీల హ‌క్కుల కోసం పోరాడుతున్న నాయ‌కుల‌ను క‌లుస్తూ త‌న పోరాటానికి మ‌ద్ద‌తు కోరుతున్నారు.

 Praveen Kumar Rushing To The Next Meeting  Those Are The Targets. Praveen Kumar,-TeluguStop.com

ఆయా నాయ‌కులు ఏ పార్టీలో ఉన్నా.అవేమీ చూడా కూడా బ‌హుజ‌న వాదంతో హ‌క్కుల నేత‌ల‌ను స‌మావేశం అవుతూ కొత్త రాజ‌కీయ వేదిక‌కు శ్రీకారం చూట్టారు.

స‌మాజంలో 80 శాతం ఉన్న బీసీల హ‌క్కుల కోసం ఉద్య‌మిస్తున్న బీసీ సంఘం జాతీయ అధ్య‌క్షుడు ఆర్.కృష్ణ‌య్య‌ను క‌లిసి బ‌హుజ‌న రాజ్యం కోసం అంద‌రూ క‌లిసి ప‌ని చేయాల‌ని ఆర్.కృష్ణ‌య‌ను కోరారు.ఈ ఇద్ద‌రూ నేత‌ల భేతి రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాశంగా మారింది.

అంతేకాకుండా ఎమ్మార్పీఎస్ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు మంద కృష్ణ మాదిగ‌ను క‌లిసిన ఆర్ ఎస్ ప్ర‌వీణ్ కుమార్‌.గాయాలైన మంద‌కృష్ణ‌ను ప‌రామ‌ర్శించారు.ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమం కోసం బ‌హుజ‌న వాదంతో ముందుకు వ‌చ్చ‌న త‌న‌ను ఆశ్వీర్వ‌దించాల‌ని మంద‌కృష్ణ‌నున ప్ర‌వీణ్ కుమార్ కోరారు.అలాగే జాతీయ మాల మ‌హానాడు అధ్య‌క్షుడు అద్దంకి ద‌యాక‌ర్‌తో స‌మావేశం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

అద్ధంకి ద‌యాక‌ర్ ప్ర‌స్తుతం కాంగ్రెస్ అధికార ప్ర‌తినిధిగా కొన‌సాగుతున్నారు.ఈ క్ర‌మంలో ఆర్ ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ఆయ‌న‌న‌ను క‌లుసుకోవ‌డంతో సంత‌రించుకుంది.

ఇలా వ‌రుస‌గా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల హ‌క్కుల కోసం ఉద్య‌మిస్తున్న నేత‌ల‌తో స‌మావేశం కావ‌డం ఆస‌క్తిరేకేతిస్తుంది.

Telugu Bahujana, Bsp, Congress, Maalmahaanadu, Mrpsmanda, Praveen Kumar, Krishna

ద‌యాక‌ర్‌ను క‌లిసిన త‌రువాత ప్ర‌వీణ్ కుమార్ చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.దాదాపు నెల రోజులుగా ద‌యాక‌ర్‌ను క‌లుసుకోవాల‌ని.అపాయింట్ మెంట్ ఇవ్వ‌క‌పోడంతో ఇలా క‌లుసుకోవాల్సి వ‌చ్చింద‌ని ప్ర‌వీణ్ కుమార్ పేర్కొన్నారు.ద‌యాక‌ర్ మాల‌మ‌హానాడు అధ్య‌క్షుడిగానే కుకుండా మేధావి అని ప్ర‌శంస‌లు కురిపించారు.ఎస్సీ దాని ఉప కులాల మ‌ధ్య ఉన్న స‌మ‌స్య‌లు తొల‌గించేందుకు ఏం చేయాల‌ని ఇద్ద‌రు నేత‌లు చ‌ర్చించుకున్న‌ట్టు వారు మీడియాకు తెలిపారు.

తాను కాంగ్రెస్‌లో అధికార ప్ర‌తినిధిగా ఉన్నా ప్ర‌వీణ్ కుమార్ ను ఆత్మీయంగా క‌లిశాన‌ని ద‌యాక‌ర్ తెలిపారు.

ప్ర‌వీణ్ కుమార్ స‌ర్వీస్ ఇంక ఆరేండ్లు ఉన్నా ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాధికారం అనే వాదంతో రాజ‌కీయాలోకి రావ‌డం సంతోషంగా ఉంద‌న్నారు.ప్ర‌వీణ్ కుమార్ లాంటి చ‌దువున్న మేధావులు రాజ‌కీయాలోకి రావాల్సిన అవ‌సంరం ఉంద‌న్నారు.

ద‌ళిత‌, బ‌హుజ‌నుల స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించిన‌ట్టు ఇరువురు నేత‌లు ప్ర‌క‌టించారు.తాము భ‌విష్య‌త్‌లో క‌లిసి ప‌ని చేసే అవ‌కాశం వ‌స్తుంద‌ని వ్యాఖ్య‌నించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube