కేసీఆర్ నిర్ణయం నచ్చకే ప్రవీణ్ కుమార్ రాజీనామా ? 

ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా వ్యవహారం తెలంగాణలో సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే.ఈ వ్యవహారంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వైఖరి కారణంగానే ప్రవీణ్ కుమార్ రాజీనామా చేయాల్సి వచ్చింది అనే అంశం తెరపైకి వచ్చింది.

 Rs Praveen Kumar, Ips Praveen, Spero, Kcr, Telangana Gurukul, Hujurabad Election-TeluguStop.com

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ కార్యదర్శిగా పనిచేసిన సమయంలోనే ప్రవీణ్ కుమార్ పై హిందూ మత వ్యతిరేక ముద్ర పడింది.బిజెపి ఆయనను టార్గెట్ చేసుకుని అనేక విమర్శలు చేసింది.

స్వేరో అనే సంస్థను స్థాపించి హిందూ దేవుళ్లను పూజించము అంటూ స్వేరో యూనియన్ ప్రతినిధులతో కలిసి ప్రవీణ్ కుమార్ గతంలో ప్రతిజ్ఞ చేయించడం పెద్ద దుమారమే రేపింది.

గురుకులాల్లో చదివిన విద్యార్థుల్లో హిందూ వ్యతిరేక భావజాలం నూరిపోస్తున్నారు అంటూ ఆయనపై విమర్శలు వచ్చాయి.

  దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి ఆందోళనలు నిర్వహించింది.కెసిఆర్ అండదండలతోనే ప్రవీణ్ కుమార్ ఈ విధంగా వ్యవహరిస్తున్నారంటూ బిజెపి విమర్శలు చేసింది.

ఇదిలా ఉంటే అకస్మాత్తుగా ప్రవీణ్ కుమార్ రాజీనామా చేయడంతో హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు, టీఆర్ఎస్ అభ్యర్థిగా నిలబడేందుకు  ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అనే ప్రచారం తెరపైకి వచ్చింది .తాను హుజురాబాద్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని,  పొలిటికల్ ఎంట్రీపై అప్పుడే ఏమి చెప్పలేను అంటూ క్లారిటీ ఇవ్వడంతో అసలు ప్రవీణ్ కుమార్ ఎందుకు రాజీనామా చేశారు అనే విషయం తెరపైకి వచ్చింది.

Telugu Hujurabad, Ips Praveen, Spero-Telugu Political News

 ప్రవీణ్ కుమార్ కెసిఆర్ కు మధ్య వ్యవహారం చేయడానికి కారణం గురుకులాలు అనే విషయం ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తోంది.వాస్తవంగా తెలంగాణ సీఎం కేసీఆర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలంగాణలో గురుకులాల సంఖ్య బాగా పెంచారు.ఆ గురుకులాలను నడిపించడంలో ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ చొరవగా ముందుకు వెళ్లడం కేసీఆర్ కు బాగా నచ్చింది.అందుకే ఆయన ను ప్రోత్సహిస్తూ కీలక నిర్ణయాలు తీసుకునే వారు.

అయితే గురుకులాలకు వస్తున్న పేరు ప్రఖ్యాతలు టిఆర్ఎస్ ప్రభుత్వానికి కాకుండా,  ప్రవీణ్ కుమార్ కు వస్తున్నట్లుగా భావించిన కెసిఆర్ గురుకులాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఆసక్తి చూపించారు.ఇదే విషయాన్ని ప్రవీణ్ కుమార్ వద్ద ప్రస్తావించగా,  దీనిని ఆయన తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలుస్తోంది.

ఈ వ్యవహారంలోనే కెసిఆర్ , ప్రవీణ్ కుమార్ మధ్య విభేదాలు వచ్చాయని,  ఆ కారణంతోనే ఆయన అకస్మాత్తుగా రాజీనామా చేశారనే విషయం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.ఒకవైపు హుజురాబాద్ లో గట్టెక్కేందుకు దళిత సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకునేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్న క్రమంలోనే, అదే సామాజిక వర్గానికి ప్రవీణ్ కుమార్ టిఆర్ఎస్ ప్రభుత్వ వైఖరి కారణంగా రాజీనామా చేసినట్లు ప్రచారం జరుగుతుండడం టిఆర్ఎస్ కు ఇబ్బందికరంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube