ప్రవీణ్ కుమార్ రాజకీయ భవిష్యత్తుపై నో క్లారిటీ.. సరైన సమయం కోసం చూస్తున్నాడా?

తెలంగాణలో కొత్త పార్టీలు, నాయకుల ఆగమనం మొదలైందని మనం అనుకోవచ్చు.బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రధాన పార్టీలుగా ఉన్న ప్రస్తుత పరిస్థితులలో బీఎస్పీ పార్టీ అనేది కూడా రేసులో ఉంది.

 Praveen Kumar No Clarity On Political Future  Looking For The Right Time,latest-TeluguStop.com

బీఎస్పీ అనేది గత కొన్నేళ్ళ నుండి తెలంగాణలో ఉన్నా పార్టీ టికెట్ దక్కని అభ్యర్థి మాత్రమే బీఎస్పీ పార్టీలో చేరి బీఎస్పీ టికెట్ పై పోటీ చేసే వారు.కాని తెలంగాణలో బీఎస్పీకి బలమైన క్యాడర్ కాని, బలమైన నాయకత్వం అనేది లేదు.

కాని ఇప్పుడు పరిస్థితి మాత్రం మారింది.మొన్నటి వరకు ఎస్సీ గురుకులాల సెక్రెటరీగా పనిచేసిన ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బాహుజనులకు తెలంగాణలో తీవ్ర అన్యాయం జరుగుతున్నదని, వాళ్ళకు అండగా నిలబడాలనే లక్ష్యంతో ఇంకా పదవీకాలం ఉన్నా వాలంటరీ రిటైర్ మెంట్ తీసుకొని రాజకీయాలలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే.

అయితే రాజీనామా చేసిన కొద్ది రోజుల వరకు తన భవిష్యత్తుపై క్లారిటీ ఇవ్వకున్నా బీఎస్పీలో చేరి ఒక్కసారిగా రాజాకీయాల్లో సంచలనం రేపారు.ఇప్పటి వరకు బాగానే ఉన్నా ఇక తరువాతి అడుగులు ఎటువైపు అన్నదానిపై క్లారిటీ లేని పరిస్థితి ఉంది.

అయితే సరైన సమయం కోసం వేచి చూస్తున్నారని, ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలనే దానిపై ఇతర పార్టీలతో కూడా చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.మరి తెలంగాణ రాజకీయాలలో ప్రవీణ్ కుమార్ ఎటువంటి పాత్ర పోషిస్తారనే దానిని ఆసక్తిగా గమనించాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube