ప్రవాస భారతీయ దినోత్సవం..పై కేంద్రం సంచలన ప్రకటన

దేశం కాని దేశంలో, ఎంతో భిన్నమైన సంస్కృతుల మధ్య.కొన్ని లక్షల మంది భారతీయ ప్రవాసీలు తమ తమ ఉన్నతమైన భవిష్యత్తు కోసం ఎన్నో దేశ విదేశాలు వలసలు వెళ్తూ ఉంటారు….

 Pravasi Bharatiya Divas Will Now Be Celebrated Every Alternate Year-TeluguStop.com

దాదాపు 2 కోట్లమంది భారతీయులు విదేశాలలో వివిధ కారణాల దృష్ట్యా నివసిస్తున్నారు అయితే అలాంటి వారందరిని ఒకే తాటిపైకి తీసుకు వచ్చే వేడుకనే ప్రవాస భారతీయ దినోత్సవంగా జరుపుకుంటారు.అయితే

ప్రతీ ఏటా జనవరి 9 న నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ఇక నుంచీ అంటే 2019 నుంచి రెండేళ్లకొకసారి నిర్వహించనున్నట్టు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ ప్రకటించారు.‘సామర్థ్య నిర్మాణం- కృత్రిమ మేధ వంటి అంశాల్లో ప్రవాస భారతీయుల పాత్ర’, ‘ప్రవాసులు మాతృభూమికి చేయగలిగిందేమిటి? .భారత్ ఎదుర్కొంటున్న సవాళ్లు వాటి పరిష్కారంలో ప్రవాసీయుల ముఖ్య భాద్యత అనే అంశాలతో థీమ్‌ ఆధారిత సెషన్లను నిర్వహిస్తామని తెలిపారు విదేశాంగ శాఖామంత్రి సుష్మా స్వరాజ్.

అయితే ఈ కార్యక్రమానికి ఎన్నారైలతో పాటు భారత్ లో ఉంటున్న ఎన్నారై లని కూడా ఆహ్వనిస్తామని తెలిపారు.వచ్చే ఏడాది ప్రవాస భారతీయ దినోత్సవాన్ని వారణాసిలో నిర్వహించనున్నారు.

జనవరి 21 నుంచి 23 దాకా ఈ కార్యక్రమం జరుగుతుందని ఆ సమయంలో ప్రవాసులు గంగలో కుంభస్నానం చేయవచ్చని.తర్వాత, జనవరి 26న ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవంలో పాల్గొనాలనుకునేవారికి ఆ అవకాశం కూడా కల్పిస్తున్నామని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube