సింగపూర్ లో వైభవంగా ప్రవాసాంధ్రులు “వినాయక చవితి” వేడుకలు...!!

సింగపూర్ లో ప్రవాసాంధ్రుల ఆధ్వర్యంలో వినాయకచవితి వేడుకలు తెలుగు వారందరూ అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.తెలుగు సంస్కృతీ, సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా జరుపుకున్న గణేశుడి చతుర్ది వేడుకలకు వర్చ్యువల్ ద్వారా బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

 Pravasandhrulu vinayaka Chaviti Celebrations In Glory In Singapore , Sri Sanskri-TeluguStop.com

సింగపూర్ లో తెలుగు బాషాభివ్రుద్ది కి, మన సంస్కృతీ, సంప్రదాయాలను, పండుగలను, భావి తరాలకు అందించేందుకు ఎనలేని కృషి చేస్తున్న “శ్రీ సాంస్కృతిక కళా సారధి” ఆధ్వర్యంలో చవితి వేడుకలన నిర్వహించారు.

బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు పాల్గొన్న ఈ పండుగ వేడుకలో దాదాపు గంటన్నర పాటు ప్రసంగించారు.

ఆదిశంకర విరచితమైన “ముదాకరాత్తమోదకం” అనే గణేశుడి పంచరత్న స్తోత్రాన్ని చెప్తూ అర్థ విశ్లేషణ అందించారు.దైనందిక జీవితంలో మనిషి ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి అనే ఎన్నో జీవిత మర్మాలు వివరించి చెప్పారు.

తనదైన శైలిలో ఛలోక్తులు విసురుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న “శ్రీ సాంస్కృతిక కళా సారధి” సభ్యులకు ఆశీస్సులు అందించారు.ఈ కార్యక్రమాన్ని సింగపూర్ లో ఉన్న ప్రతీ తెలుగు వారు, పలు దేశాలలో ఉన్న తెలుగు కుటుంభాలు వీక్షించేలా శ్రీ సాంస్కృతిక కళా సారధి సంస్థ ప్రత్యేకమైన ఏర్పాటు చేసింది.

గరికపాటి వారు గణేశ పంచరత్న స్త్రోత్రం యొక్క విశిష్టతను ఎంతో అద్భుతంగా వివరిస్తూ భగవంతుని అనుగ్రహం పొందేలా చేశారని, అదే సమయంలో తమకు గరికపాటి వారి దివ్య ఆశీస్సులు కూడా అందాయని శ్రీ సాంస్కృతిక కళా సారధి సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్ తెలిపారు.తెలుగు వారందరూ ఎంతో ఇష్టంగా, భక్తి శ్రద్దలతో జరుపుకునే ఈ పండుగను ఈ రోజు గరికపాటి వారి మధ్య జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, తెలుగు బాషాభిమాని, తెలుగు వెలుగు కోసం కృషి చేస్తున్న, శ్రీ సాంస్కృతిక కళా సారధి సభ్యులు పాలకుర్తి సుబ్బు తెలిపారు.

సింగపూర్ లో ఉన్న పలు కుటుంభాలు ఈ వర్చువల్ విధానం ద్వారా పాల్గొనగా, వందలాది మంది ఈ కార్యక్రమాన్ని వీక్షించారు.ఈకార్యక్రమానికి సింగపూర్ గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ అలాగే పలు సంస్థలు సహకారం అందించాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube