ఊరికోసం ఆ “ఎన్నారై కుర్రాళ్ళు” అద్భుతం చేశారు..

పుట్టిన ఊరిని కన్న తల్లిని విడిచి ఉండలేము.ఎక్కడికి వెళ్ళినా సరే మనసు అటువైపే లాగుతూ ఉంటుంది.

 Pravasa Nri Kadapa District-TeluguStop.com

జీవనోపాది కోసం ఎంతో మంది అలాంటి ఊళ్ళని విడిచి విదేశాలకి వెళ్తారు కానీ ఎంతో మంది ఊరినీ మర్చిపోతారు కన్న వాళ్ళని వదిలేస్తారు అయితే ఈ ఎన్నారై కుర్రాళ్ళు మాత్రం అలా కాదు తాము పుట్టిన ఊరికోసం మాత్రమె కాదు పక్కనే ఉన్న ఊళ్లకోసం కూడా నడుం బిగించారు ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు.వివరాలలోకి వెళ్తే.

కడప జిల్లా చిన్నమండెం మండలంలోని మారుమూల గ్రామం చాకిబండకు చెందిన కుర్రాళ్లు గల్ఫ్‌ వేదికగా ఇప్పుడు ఇదే పనిలో ఉన్నారు…ప్రవాస సేవా సంఘం పేరిట ఆరునెలలుగా తమ ఊరిజనానికి కొత్త వెలుగులు పంచుతున్నారు.చాకిబండ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది.ఈ గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి ఒకరిద్దరు గల్ఫ్‌బాట పట్టారు.వీరిలో కొందరు బాగా డబ్బులు సంపాదించి అక్కడే స్థిరపడ్డారు.అయితే గల్ఫ్‌లో ఉంటున్న ఈ ఊరికి చెందిన కుర్రాళ్లకు ఒక ఆలోచన వచ్చింది.

ఎవరికీ ఏ లోటు లేదు మన ఊరికి ఏదైనా చేస్తే బాగుంటుంది అనుకున్నారు అనుకున్నదే తడవుగా అంతా కలిసి 2017 జూన్‌ 4వ తేదీన ప్రవాస సేవా సంఘంగా ఏర్పడ్డారు.

చాకిబండతో మొదలుపెట్టి, దిగువ గొట్టివీడు, మల్లూరు, కొత్తపల్లె, వండాడి, సరిహద్దులోని ఏపిలవంక వరకూ కూడా తాము చేసే సేవల్ని విస్తరించడం మొదలుపెట్టారు.


అక్కడ ఉన్న తమ సభ్యుల ద్వారా ఎప్పటికప్పుడు సమస్యలని తెలుసుకుంటూ పరిష్కారాలు చేసేవారు అలాగే తల్లి తండ్రులు చనిపోయి అనాధలైన ఇద్దరు మతి స్థిమితం లేని పిల్లలని వారు ఆదుకున్నారు.

వెంటనే బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రితో వారిద్దరికీ శస్త్రచికిత్స చేయించారు.ఇప్పుడు చాకిబండలో ఈ అన్నదమ్ములు ఉపాధి వేటలో ఉన్నారు…భర్త చనిపోయి సాయం కోసం ఎదురు చూస్తున్న మహిళతో చిన్న కొట్టు పెట్టించి ఉపాది చూపించారు.ప్రతి నెలా 60 మంది పేద వృద్ధులకు సంఘం ప్రతినిధులు రూ.200 చొప్పున పింఛన్‌ అందిస్తున్నారు.విదేశాలు వెళ్ళిపోయినా ఎంతో మంది తమ కుటుంభాలనే పట్టించుకోని క్రమంలో వీరు చేస్తున్న సాయం నిజంగా ఆదర్శ ప్రాయం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube