కుమార్తె చనిపోయాక ఒక్క రూపాయ్ లేదంటూ సీరియల్ నటి తల్లితండ్రుల ఆవేదన!

బుల్లితెరపై ప్రసారమైన చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న నటి ప్రత్యూష బెనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.సీరియల్ నటిగా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న ఈమె ఆత్మహత్య చేసుకోవడంతో దేశవ్యాప్తంగా ఈ వార్త తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

 Pratyusha Banerjee Parents Open Up About Facing Financial Losses-TeluguStop.com

ప్రత్యూష ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం తన బాయ్ ఫ్రెండ్ రాజ్‌ సింగ్‌ కారణమని ఆరోపణలు తలెత్తాయి.

ప్రత్యూష బెనర్జీ మరణం తర్వాత తన తల్లిదండ్రులు తనకు న్యాయం జరగాలని పోరాడుతూ తమ సర్వస్వం కోల్పోయామని, తన కూతురి మరణం తరువాత చేతిలో చిల్లిగవ్వ కూడా లేదని ప్రత్యూష తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

 Pratyusha Banerjee Parents Open Up About Facing Financial Losses-కుమార్తె చనిపోయాక ఒక్క రూపాయ్ లేదంటూ సీరియల్ నటి తల్లితండ్రుల ఆవేదన-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం ఒక సింగిల్ రూమ్ లో జీవనం కొనసాగిస్తున్నామని, పూట గడవడం కోసం తను చైల్డ్ కేర్ సెంటర్ లో పని చేస్తున్నానని తన భర్త కథలు రాస్తూ పూట గడుపుతున్నాం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Telugu Balika Vadhu, Balika Vadhu Actress, Boy Friend Rahul Raja Singh, Financial Struggles, Parents, Police Arrest, Prathyusha Banerjee Parents, Pratyusha Banerjee-Movie

2016వ సంవత్సరంలో ప్రత్యూష బెనర్జీ ఓ అపార్ట్మెంట్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది ఈ క్రమంలోనే తన మరణం వెనుక తన బాయ్ ఫ్రెండ్ రాజ్‌ సింగ్‌ కారణం అంటూ ఆరోపణలు రావడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.ఆ తర్వాత మూడు నెలల అనంతరం బెయిల్ పై బయటకు వచ్చిన రాజ్ సింగ్ నటి సలోని శర్మను వివాహం చేసుకుని సంతోషంగా గడుపుతున్నారని తమ కూతురు మరణం తరువాత మా సర్వస్వాన్ని కోల్పోయామని ఈ సందర్భంగా ప్రత్యూష తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

#BoyFriend #BalikaVadhu #Parents #Police Arrest #Balika Vadhu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు