ప్రతిరోజూ పండగే క్లోజింగ్ కలెక్షన్లు.. తేజు కెరీర్‌లోనే హయ్యెస్ట్  

Pratiroju Pandage Closing Collections-pratiroju Pandage,raashi Khanna

మెగా కాంపౌండ్ నుండి వచ్చిన సాయి ధరమ్ తేజ్ సుప్రీం హీరోగా తనదైన ముద్ర వేసుకున్న సాయి ధరమ్ తేజ్ తాజాగా ప్రతిరోజూ పండగే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ సినిమాతో సాయి ధరమ్ తేజ్ ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్న సక్సెస్‌ను అందుకోగలిగాడు.

Pratiroju Pandage Closing Collections-Pratiroju Raashi Khanna

దర్శకుడు మారుతి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొంది అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది.

సాయి ధరమ్ తేజ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటించగా భారీ తారాగణంతో మారుతి సక్సెస్‌ను కొట్టాడు.

ఆకట్టుకునే కుటుంబం ఎమోషనల్ కంటెంట్‌తో ఈ సినిమాను తెరకెక్కించాడు మారుతి.సాయి ధరమ్ తేజ్ యాక్టింగ్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకునే కథాంశం కలగలిసి ఈ సినిమాను సక్సె్స్ చేశాయి.ఈ సినిమా టోటల్ రన్‌లో రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.29.76 కోట్లు సాధించగా, ప్రపంచవ్యాప్తంగా రూ.33.91 కోట్లు సాధించింది.కాగా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్‌ను చిత్ర యూనిట్ రూ.18 కోట్లకు అమ్మడంతో బయ్యర్లకు లాభాల పంట పండింది.

తేజుతో పాటు ఈ సినిమాలో సత్యరాజ్, రావు రమేష్ పాత్రలకు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో సినిమా యూనిట్ సంతోషం వ్యక్తం చేశారు.

ప్రతిరోజూ పండగే ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసిన కలెక్షన్లు ఏరియాల వారీగా ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 12.35 కోట్లు

సీడెడ్ – 3.93 కోట్లు

నెల్లూరు – 0.92 కోట్లు

కృష్ణా – 2.18 కోట్లు

గుంటూరు – 2.01 కోట్లు

వైజాగ్ – 4.80 కోట్లు

ఈస్ట్ – 2.04 కోట్లు

వెస్ట్ – 1.53 కోట్లు

టోటల్ ఏపీ+తెలంగాణ – 29.76 కోట్లు

రెస్టాఫ్ ఇండియా – 2.10 కోట్లు

ఓవర్సీస్ – 2.05 కోట్లు

టోటల్ వరల్డ్‌వైడ్ – 33.91 కోట్లు

తాజా వార్తలు

Pratiroju Pandage Closing Collections-pratiroju Pandage,raashi Khanna Related....