సదా నన్ను నడిపే రివ్యూ: స్వచ్ఛమైన ప్రేమకథ ఎలా ఉందంటే?

చిత్రం: సదా నన్ను నడిపే

 Prathik Prem Karan Sadaa Nannu Nadipe Movie Review And Rating Details, Sada Nan-TeluguStop.com

రిలీజ్ డేట్: 24/06/2022

బ్యానర్: ఆర్ పి మూవీ మేకర్స్

నటీనటులు:

ప్రతీక్ ప్రేమ్ కరణ్ , వైష్ణవి పట్వర్ధన్, నాజర్, అలీ, రాజీవ్ కనకాల, రంగస్థలం మహేష్, జీవ తదితరులు.

ఎడిటర్: ఎస్ ఆర్ శేఖర్

మ్యూజిక్ డైరెక్టర్: ప్రతీక్ ప్రేమ్ కరణ్ , ప్రభు ప్రవీణ్

నిర్మాతలు: ఆర్ పి మూవీ మేకర్స్

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ప్రతీక్ ప్రేమ్ కరణ్

వానవిల్లు సినిమా తర్వాత హీరో ప్రతీక్ ప్రేమ్ కరణ్ నటించిన తాజా చిత్రం సదా నన్ను నడిపే.ఈ సినిమాలో వైష్ణవి పట్వర్ధన్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.అలాగే ఇందులో నాగేంద్రబాబు, నాజర్, రాజీవ్ కనకాల, ఆలీ పలువురు కీలక పాత్రలో నటించారు.

ఇకపోతే హీరో ప్రతీక్ ప్రేమ్ కరణే ఈ సినిమాకు దర్శకత్వం,స్క్రీన్ ప్లే,సంగీతాన్ని అందించారు.స్వచ్ఛమైన ప్రేమకథతో రూపొందిన ఈ సినిమా నేడు థియేటర్లలో విడుదల అయ్యింది.

Telugu Mahesh, Nazar, Rajiv Kanakala, Sadanannu, Sadaanannu-Movie

కథ:

మైఖేల్ జాక్సన్ (ప్రతీక్ ప్రేమ్ కరణ్) సరదాగా స్నేహితులతో గడిపే కుర్రాడు.అతడు సాహాతో (వైష్ణవి పట్వర్దన్) ప్రేమలో పడతాడు.ఆమె వద్దు అన్నా కూడా ఎంతో సిన్సియర్ గా లవ్ చేస్తూనే ఉంటాడు.సాహా తండ్రి రాజీవ్ కనకాల కూడా మైఖేల్ ప్రేమని అంగీకరించ పోయేసరికి ఎలా అయిన మైఖేల్ మాత్రం సాహా ప్రేమని పొందాలని పరితపిస్తూ ఉంటాడు.

ఇందులో మైఖేల్ ప్రేమని సాహా అంగీకరించి వివాహం చేసుకొని పెళ్ళైన తరువాత మొదటి రోజు నుంచే మైఖేల్ ని దూరం పెడుతూ ఉంటుంది.పెళ్లి చేసుకుని కూడా సాహా మైఖేల్ ని ఎందుకు దూరం పెడుతుంది? ఆమె సమస్య ఏంటి? హీరో దాన్ని ఎలా పరిష్కరించాడు? వీరిద్దరూ చివరకి కలుసుకున్నారా? లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే మరి.

Telugu Mahesh, Nazar, Rajiv Kanakala, Sadanannu, Sadaanannu-Movie

కథా కథనం విశ్లేషణ :

ఇంతకుముందు ప్రేమ కథలతో వచ్చిన గీతాంజలి, కలిసుందాం రా లాంటి సినిమాలు మాదిరిగా హీరో కమ్ డైరెక్టర్ ప్రతీక్ ప్రేమ్ కరణ్ ఈ సినిమాలో ఎంతో ఎమోషనల్ గా, స్వచ్ఛమైన ప్రేమతో ఎంటర్టైనింగ్ గా వెండితెరపై ఆవిష్కరించారు.ఈ సినిమాలో మనకు బాగా తెలిసిన వ్యక్తి చనిపోతున్నారు అని తెలిసిన తరువాత వారితో ఉన్న ఆ కొద్ది క్షణాలలో ఎంత మధుర జ్ఞాపకంగా గుర్తుపెట్టుకుంటాను అనేది ఇందులో చక్కగా చూపించారు.ప్రేమించిన వ్యక్తి కోసం ఎలాంటి త్యాగాన్నీ అయినా చేయవచ్చు అన్నది ఇందులో ఎమోషనల్ గా చూపించారు.

Telugu Mahesh, Nazar, Rajiv Kanakala, Sadanannu, Sadaanannu-Movie

నటీనటుల పనితీరు:

హీరో కమ్ డైరెక్టర్ ప్రతీక్ ప్రేమ్ అద్భుతంగా నటించాడు.ఒకవైపు హీరోగా నటిస్తూనే దర్శకత్వ బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహించారు.హీరోయిన్ కూడా బాగానే నటించింది.అలాగే ఇందులో ఆలీ బాగా నవ్వులు పూయించాడు.

సాంకేతిక నిపుణుల పనితీరు :

ఇందులో సంగీతం బాగుంది.అలాగే నందు కంపోజ్ చేసిన ఫైట్స్ బాగున్నాయి.ఈ సినిమాలో విజయవాడ, హైదరాబాద్, కొడైకెనాల్, కులుమనాలిలో చిత్రీకరించిన లొకేషన్స్ బాగున్నాయి.

రేటింగ్ : 2.75/5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube