పండగకు ముందే ప్రతి రోజూ పండగే

సాయి ధరమ్‌ తేజ్‌ వరుసగా అరడజను ఫ్లాప్‌ల తర్వాత చేసిన ‘చిత్రలహరి’ చిత్రం కాస్త పర్వాలేదు అనిపించింది.వరుస ఫ్లాప్‌లకు బ్రేక్‌ వేసిన చిత్రలహరి చిత్రంతో సాయి ధరమ్‌ తేజ్‌ కాస్త బూస్ట్‌ అయ్యాడు.

 Prathi Roju Pandage Movie Going To Release Before This Sankranthi-TeluguStop.com

చిత్రలహరి చిత్రం ఇచ్చిన సక్సెస్‌ జోష్‌తో మారుతి దర్శకత్వంలో ‘ప్రతి రోజు పండగే’ అనే చిత్రాన్ని చేశాడు.మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై సినీ వర్గాల్లో చాలా అంచనాలు ఉన్నాయి.

ప్రేక్షకులు ఈ చిత్రం గురించి పెద్దగా ఆసక్తి లేకున్నా సినిమా తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటుందని కొందరు విశ్లేషకులు మాత్రం బల్ల గుద్దుతున్నారు.

మారుతి దర్శకత్వంలో వచ్చిన గత చిత్రం బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా సక్సెస్‌ సాధించలేదు.

అయినా కూడా మారుతిపై నమ్మకంతో సాయి ధరమ్‌ తేజ్‌ ఈ చిత్రాన్ని చేశాడు.ఈ చిత్రానికి గీతా ఆర్ట్స్‌ మరియు యూవీ క్రియేషన్స్‌ వారు నిర్మాతలు అవ్వడం వల్ల కూడా సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో అంచనలు భారీగా ఉన్నాయి.20 కోట్ల లోపు బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రంకు దాదాపుగా 30 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ అవ్వబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

Telugu Kattappa, Prathiroju, Sai Dharam Tej, Sankranthi, Tollywood Box-

  ఇక ఈ చిత్రం సంక్రాంతికి విడుదల చేయాలని భావించారు.కాని సంక్రాంతికి తీవ్రమైన పోటీ ఉన్న కారణంగా సంక్రాంతి పండుగకు ముందే ప్రతి రోజు పండుగే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన సినిమాను డిసెంబర్‌ 20వ తారీకున విడుదల చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చేసింది.

క్రిస్మస్‌ సందర్బంగా సినిమాను విడుదల చేయడం వల్ల ఆ హాలీడేస్‌ను వినియోగించుకోవాలని యూనిట్‌ సభ్యులు భావిస్తున్నారు.తేజూకు జోడీగా ఈ చిత్రంలో రాశిఖన్నా నటించింది.సత్యరాజ్‌ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం టీజర్‌కు మంచి స్పందన వచ్చిన విషయం తెల్సిందే.తేజూ లుక్‌ కూడా చాలా కూల్‌గా ఆకట్టుకునే విధంగా ఉంది.

అందుకే సినిమా సక్సెస్‌ అనిపిస్తుంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube