పవన్‌ కళ్యాణ్‌ను పిలిచారట

సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా రాశిఖన్నా హీరోయిన్‌గా రూపొందిన ప్రతిరోజు పండుగే సినిమా విడుదలకు సిద్దం అయ్యింది.ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకను 15వ తారీకున భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

 Prathi Roju Pandage Cinima Pawan Kalyan-TeluguStop.com

ప్రస్తుతం సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నారు.మరో వైపు ప్రీ రిలీజ్‌ వేడుక కోసం ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు.

ఈ వేడుకకు ఎవరు ముఖ్య అతిథిగా రాబోతున్నాడు అనే విషయమై ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం చిత్ర యూనిట్‌ సభ్యులు ఈ ప్రీ రిలీజ్‌ వేడుక కోసం పవన్‌ కళ్యాణ్‌ను సంప్రదించారని సమాచారం అందుతోంది.

ఆయన కూడా ఓకే చెప్పాడట.ఈమద్య కాలంలో సినిమాలకు చాలా దగ్గరగా ఉంటు వస్తున్నాడు.అందుకే ఈ సినిమా వేడుకలో పవన్‌ పాల్గొనడం కన్ఫర్మ్‌ అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.ఒక వేళ పవన్‌ హాజరు కాకుంటే రామ్‌ చరణ్‌ లేదా చిరంజీవి అయినా హాజరు అయ్యే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube