హ్యాట్సాఫ్‌ : రెండు కాళ్లు, రెండు చేతులు లేకున్నా ఆత్మస్థైర్యంతో ఎంబీఏ చేసి ఆఫీసర్‌ అయ్యాడు  

Pratap Lost Both Hands And Legs At 5 Years Yet, He Did Not Lose Hope-no Arms,no Legs,oil And Natural Gas Corporation,raja Mahendra Pratap

మనం గతంలో చెప్పుకున్నట్లుగానే కాళ్లు చేతులు అన్ని బాగున్న వారు కూడా కష్టపడి చదివేందుకు బద్దకిస్తూ ఉంటారు.శారీక వైకల్యం ఉన్న వారు వారి పనులు వారు చేసుకోవడమే చాలా ఇబ్బందిగా ఉంటుంది.

Pratap Lost Both Hands And Legs At 5 Years Yet, He Did Not Lose Hope-no Arms,no Legs,oil And Natural Gas Corporation,raja Mahendra Pratap-Pratap Lost Both Hands And Legs At 5 Years Yet He Did Not Lose Hope-No Arms No Oil Natural Gas Corporation Raja Mahendra

అలాంటిది ఎంతో మంది అంగవైకల్యంతో బాధపడుతున్న వారు కష్టపడి ఉన్నత స్థాయికి చేరిన వారు ఉన్నారు.అలాంటి వారిలో ప్రతాప్‌ ఒకరు.ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.ఇతడు అంగవైకల్యంతో బాధపడుతున్న వారికి మాత్రమే కాకుండా అన్ని బాగుండి వైకల్యం ఉన్న వారిలో కూర్చుని ఉండే వారికి కూడా ఆదర్శంగా చెప్పుకోవచ్చు.

Pratap Lost Both Hands And Legs At 5 Years Yet, He Did Not Lose Hope-no Arms,no Legs,oil And Natural Gas Corporation,raja Mahendra Pratap-Pratap Lost Both Hands And Legs At 5 Years Yet He Did Not Lose Hope-No Arms No Oil Natural Gas Corporation Raja Mahendra

ప్రతాప్‌ గురించి చెప్పాలంటే.చిన్నతనంలోనే స్నేహితులతో ఆడుకుంటున్న సమయంలో కరెంట్‌ షాక్‌ తగిలి రెండు కాళ్లు, రెండు చేతులు కోల్పోయడు.

కాళ్లు మోకాళ్ల వరకు పోగా, చేతులు మో చేతుల వరకు కోల్పోయాడు.కేవలం 6 ఏళ్ల వయసులోనే అతడు పూర్తి వైకల్యం బారిన పడ్డాడు.దాంతో తల్లిదండ్రులు అతడిని స్కూల్‌కు పంపించలేదు.స్కూల్‌కు వెళ్లినా ఇబ్బందులు ఎదురవుతాయని అమ్మానాన్న ఇంటి వద్దే ఉంచుకున్నారు.చెల్లి స్కూల్‌కు వెళ్లి వస్తుంటే ప్రతాప్‌కు తాను స్కూల్‌కు వెళ్లలేక పోతున్నందుకు బాధ వేసేది.కొన్నాళ్ల తర్వాత చెల్లి సాయంతో చదవడం ప్రారంభించాడు.

ప్రతాప్‌కు చదువుపై ఉన్న కోరికను గుర్తించిన తల్లిదండ్రులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి అతడిని స్కూల్‌కు పంపించడం మొదలు పెట్టారు.

దాంతో ప్రతాప్‌ స్కూల్‌ విద్యను పూర్తి చేశాడు.స్కూల్‌లో రెండు చేతులు లేకున్నా కూడా అతడు రెండు మోచేతుల సాయంతో రాసేందుకు ప్రయత్నించే వాడు.రెండు మోచేతులతో కంప్యూటర్‌ కీ బోర్డ్‌ను కూడా చాలా స్పీడ్‌గా ప్రతాప్‌ ఉపయోగించేవాడు.

సామాన్యుల మాదిరిగానే ప్రతాప్‌ కంప్యూటర్‌ను వాడుతూ ఉంటే అంతా ఆశ్చర్యంగా చూసే వారు.

ప్రతాప్‌ బికామ్‌ పూర్తి చేసి ఐసెట్‌లో ర్యాంకు సాధించి ఎంబీఏ చేశాడు.ప్రముఖ కాలేజ్‌లో ఎంబీఏ పూర్తి చేసిన ప్రతాప్‌కు ఉద్యోగం విషయంలో చాలా ఇబ్బందులు తలెత్తాయి.

పలు ఇంటర్వ్యూలకు వెళ్లి అక్కడ అడిగిన ప్రశ్నలు అన్నింటికి సమాధానం చెప్పినా కూడా అంగవైకల్యం కారణంగా మీకు ఈ ఉద్యోగం ఇవ్వలేం అంటూ చెప్పే వారు.దాంతో ప్రతాప్‌ చాలా నిరుత్సాహ పడేవాడు.చివరకు ఒక స్వచ్చంద సంస్థ స్టాస్టికల్‌ ఆఫీసర్‌ పోస్ట్‌ను ప్రతాప్‌కు ఇచ్చింది.

చిన్న వయసులోనే రెండు కాళ్లు రెండు చేతులు కోల్పోయిన ప్రతాప్‌ ఆత్మస్థైర్యం మరియు పట్టుదలతో చదివి ఉద్యోగం సంపాదించుకున్నాడు.

కొందరు అంగవైకల్యంతో బాధపడుతున్న వారు ఏం చేయలేని నిరుత్సాహ స్థితిలో ఉంటారు.ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది.అందుకే వారి ప్రతిభను వారే గుర్తించుకుని అందులో రాణించేందుకు ప్రయత్నించాలి.ప్రయత్నించకుండా ప్రయోజనం అనేది ఎక్కడా ఉండదు.అందుకే కష్టపడి ప్రయత్నించి ఫలితాన్ని పొందాలి.