ఏపీలానే తెలంగాణ కూడా టికెట్ ధరల విషయంలో అలాంటి నిర్ణయమే తీసుకోవాలి?

గత కొద్దిరోజులుగా ఏపీలో టికెట్ రేట్ల వ్యవహారం గురించి వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ విషయం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు.

 Pratani Ramakrishna Goud, Ticket Prices Hiked, Telangana Film Chamber Of Commerc-TeluguStop.com

థియేటర్లో సినిమా టికెట్ రేట్లు పెంచాలి అని సినీ ఇండస్ట్రీ వారు ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం ఒక మధ్యతరగతి కుటుంబం వారి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ విషయంపై తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ పలు ఆసక్తికర విషయాలు చేశారు.

గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ జిల్లా కేంద్రాలు ఇలా ప్రాంతాలనుబట్టి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధర నిర్ణయించడం బాగానే ఉంది.

అదే విధంగా అలాంటి విధానం తెలంగాణ రాష్ట్రంలో కూడా వస్తే బాగుంటుంది అని రామకృష్ణ గౌడ్ అన్నారు.ఈ సందర్భంగా తాజాగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.

తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్ల విషయంలో విడుదల చేసిన జీవో 120 వల్ల చిన్న చిత్రాల నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారు అని తెలిపారు.ఆంధ్ర ప్రదేశ్ లో మాదిరిగానే ప్రాంతాలను బట్టి టికెట్ రేట్ ఉంటే తెలంగాణలో చిన్న చిత్రాలు బతికి బట్ట కట్టలేని పరిస్థితి.

కాబట్టి జీవో 120 ని కచ్చితంగా సవరించాలి అని ఆయన తెలిపారు.

Telugu Ap, Ticket Hiked-Movie

అదేవిధంగా లీజ్ విధానాన్ని కూడా రద్దు చేయాలి అని అతను తెలిపారు.థియేటర్స్ యాజమాన్యాన్ని, ప్రభుత్వాలను పెద్ద నిర్మాతలు తప్పుదోవ పట్టిస్తున్నారని, టికెట్ రేట్లు పెంచుకున్నప్పుడు థియేటర్ అద్దెలు కూడా పెంచాలి, కానీ పెంచడం లేదు.దీంతో ఎగ్జిబిటర్స్ నష్టపోతున్నారు .ఇండస్ట్రీ అంటే ఆ నలుగురు మాత్రమే కాదు కదా అని ఆయన తెలిపారు.ఆ నలుగురు ఐదుగురు దోపిడీ వల్ల చిన్న నిర్మాతలు చిన్న హీరోలు మునిగిపోతున్నారు.

కాబట్టి ఏపీలో మాదిరిగానే తెలంగాణలో కూడా ఒక రేటు కాకుండా పాత పద్ధతినే కొనసాగించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ గారిని కలిసి వివరిస్తామని తెలిపారు రామకృష్ణ గౌడ్.ఇక ఈ విలేకరుల సమావేశంలో తెలంగాణ డైరెక్టర్ యూనియన్ అధ్యక్షుడు ఆర్ రమేష్ నాయుడు, వైస్ ప్రెసిడెంట్ ఎస్ వంశీ గౌడ్, టీ మా జనరల్ సెక్రటరీలు సకమ్‌ స్నిగ్ధ, బి కిషోర్‌ తేజ, వైస్‌ ప్రెసిడెంట్‌ ఎ.కిరణ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube