‘కరోనా వ్యాక్సిన్‌’ పనులు మళ్లీ మొదలు పెట్టిన దర్శకుడు

ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వ్యాదికి వ్యాక్సిన్‌ను కనిపెట్టేందుకు అంతర్జాతీయ స్థాయి ఔషద సంస్థలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి.ఈ ఏడాది చివరి వరకు లేదంటే వచ్చే ఏడాది ఆరంభంలో వ్యాక్సిన్‌ రావడం ఖాయం.

 Director Prashanth Varma, Lockdown Shooting, Movie On Corona, Corona Vaccine, Bh-TeluguStop.com

ఇప్పటికే ఇండియన్‌ కంపెనీ అయిన భారత్‌ బయోటెక్‌ కంపెనీ వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రైల్స్‌ను నిర్వహించేందుకు అనుమతులు తీసుకుంది.మనుషులపై ట్రైల్స్‌ నిర్వహిస్తున్నారు.

ఈ సమయంలోనే కరోనా వ్యాక్సిన్‌ను తయారు చేసే పనిలో దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ఉన్నాడు.

ఇప్పటికే ఈయన 10 శాతం వ్యాక్సిన్‌ను తయారు చేశాడట.లాక్‌డౌన్‌ కారణంగా బ్యాలన్స్‌ ఆగిపోయింది.ఇప్పుడిప్పుడే మళ్లీ షూటింగ్స్‌కు అనుమతులు వస్తున్న నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్‌ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసేందుకు దర్శకుడు సిద్దం అయ్యాడు.షూటింగ్‌లో పాల్గొనబోతున్న ప్రతి ఒక్కరికి కూడా టెస్టులు చేయించాం.త్వరలోనే కరోనా వ్యాక్సిన్‌ ను ప్రారంభించబోతున్నాం అన్నాడు.

ఇండియాలో కరోనా కేసులు బయట పడకముందే ప్రశాంత్‌ వర్మ ఈ సినిమాను ప్రారంభించాడు.

Telugu Bharath Biotech, Corona Vaccine, Prashanth Varma, Lockdown, Corona-

పది శాతం పూర్తి అయిన తర్వాత షూటింగ్‌కు అంతరాయం కలిగింది.మళ్లీ ఇప్పుడు సినిమా షూటింగ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈ ఏడాది చివరి వరకు సినిమాను పూర్తి చేసి విడుదల చేసే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.

భారీ ఎత్తున అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంను తెలుగుతో పాటు పలు భాషల్లో విడుదల చేస్తామని దర్శకుడు ప్రశాంత్‌ వర్మ అన్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube