'హను మ్యాన్‌' ఎవరో తెలిసి పోయింది.. సెట్‌ అయ్యేనా?

అ!, జాంబీరెడ్డి చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ప్రశాంత్ వర్మ ఇప్పటికే హనుమ్యాన్ సినిమాను ప్రకటించాడు.రియల్‌ సూపర్ హీరో హనుమాన్ కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

 Prashanth Varma Hanu Man Movie Hero-TeluguStop.com

ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతుంది.ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ త్వరలో మొదలు కాబోతున్న నేపథ్యంలో హీరో ఎవరు అనే విషయమై క్లారిటీ వచ్చేసింది.

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ వర్గాల అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా లో హీరోగా తేజ సజ్జ నటించబోతున్నాడు.ఈయన జాంబీ రెడ్డి సినిమా లో నటించి మెప్పించాడు.

 Prashanth Varma Hanu Man Movie Hero-హను మ్యాన్‌’ ఎవరో తెలిసి పోయింది.. సెట్‌ అయ్యేనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అతి త్వరలోనే ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందట.ప్రస్తుతం హను మ్యాన్ సినిమా స్క్రిప్ట్‌ వర్క్ జరుగుతోంది.

భారీ వీఎఫ్‌ఎక్స్ వర్క్ ఉండే ఈ సినిమా ను వచ్చే ఏడాది లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్‌ చేస్తున్నారు.

Telugu Film News, Hanu Man, Movie News, Prashanth Varma, Teja Sajja-Movie

హను మ్యాన్‌ సినిమా లో హీరోగా తేజ సజ్జా హీరోగా నటించబోతున్న నేపథ్యంలో ఆయన పాత్ర ఏంటీ అసలు నిజంగా ఈ సినిమా లో హనుమాన్‌ ఉంటాడ అనేది ఆ పాత్రను ఎవరు చేయబోతున్నారు అనేది అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.వరుసగా ఈ సినిమా షూటింగ్‌ షెడ్యూల్‌ ను ప్లాన్‌ చేస్తున్నారు.షూటింగ్‌ కు సంబంధించిన షెడ్యూల్‌ ను ప్లాన్‌ చేస్తున్నారు.

ఈ సినిమా తో తేజ సజ్జా మరింతగా కమర్షియల్‌ హీరోగా పేరు దక్కించుకుని అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటాడని అంతా నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.తేజ సజ్జా ఇంద్ర సినిమాలో చిరంజీవి చిన్నప్పటి పాత్రలో నటించి మెప్పించాడు.

మళ్లీ ఇన్నాళ్ల తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి వరుసగా సినిమాలు చేస్తున్నాడు.హను మ్యాన్ సినిమా చిత్రీకరణ మొదలు అయ్యి విడుదల తర్వాత తేజ కు మరింతగా ఆఫర్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు.

#Prashanth Varma #Teja Sajja #Hanu Man

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు