వెయిటింగ్‌ అనేది నచ్చదంటున్న యంగ్‌ డైరెక్టర్‌, అందుకే అఖిల్‌ మూవీ క్యాన్సిల్‌  

Director Prashanth Varma Start The Coronavirus Movie, Prashanth Varma, Awe Kalki, Coronavirus, Most Eligible Bachelor, Akhil, Mahesh Babu, NTR, Chiranjeevi - Telugu Akhil, Awe, Chiranjeevi, Coronavirus, Kalki, Mahesh Babu, Most Eligible Bachelor, Ntr, Prashanth Varma

అ! చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన ప్రశాంత్‌ వర్మ ఆ తర్వాత కల్కి చిత్రాన్ని తెరకెక్కించాడు.ఆ సినిమా నిరాశ పర్చింది.

 Prashanth Varma Awe Kalki Coronavirus

ప్రస్తుతం కరోనా వైరస్‌పై ఒక చిత్రంను తెరకెక్కిస్తున్నాడు.భారీ ఎత్తున అంచనాలున్న కరోనా వైరస్‌ చిత్రం గురించి మాట్లాడుతూ ఇప్పటి వరకు తెలుగులో ఏ ఒక్కరు కూడా ఇలాంటి జోనర్‌లో సినిమా ప్రయత్నించలేదు.

తప్పకుండా ఇదో అద్బుత చిత్రంగా నిలుస్తుందనే నమ్మకంను వ్యక్తం చేశాడు.ఇక అఖిల్‌తో గత సంవత్సరంలో ఒక సినిమాను అనుకున్న ప్రశాంత్‌ వర్మ ఆ సినిమాను క్యాన్సిల్‌ చేసుకున్నాడు.

వెయిటింగ్‌ అనేది నచ్చదంటున్న యంగ్‌ డైరెక్టర్‌, అందుకే అఖిల్‌ మూవీ క్యాన్సిల్‌-Movie-Telugu Tollywood Photo Image

బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో అఖిల్‌ హీరోగా ప్రస్తుతం మోస్ట్‌ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే.ఆ సినిమా గత ఏడాది చివరి వరకు పూర్తి అయితే ఈ ఏడాది ఆరంభంలో అఖిల్‌తో ప్రశాంత్‌ వర్మ సినిమా ప్రారంభం అవ్వాల్సి ఉంది.

కాని కొన్ని కారణాల వల్ల మోస్ట్‌ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ చిత్రం ఆలస్యం అయ్యింది.దాంతో మరో ఆలోచన లేకుండా వెయిటింగ్‌ చేయకుండా వెంటనే కరోనా వైరస్‌ చిత్రం షూటింగ్‌ ప్రారంభించాడు.

స్టార్‌ హీరోలతో సినిమాలు చేయాలని ఉన్నా కూడా వారితో సినిమాలకు చాలా కాలం వెయిట్‌ చేయాల్సి ఉంటుందని, అందుకే వారి కోసం వెయిట్‌ చేయకుండా సినిమాలు చేస్తూ పోతున్నాను అన్నాడు.ప్రస్తుతం రెండు వెబ్‌ సిరీస్‌లను హాట్‌స్టార్‌ కోసం చేస్తున్నానంటూ ప్రకటించిన ప్రశాంత్‌ వర్మ మహేష్‌బాబు ఎన్టీఆర్‌ల పిలుపు కోసం వెయిట్‌ చేస్తున్నట్లుగా చెప్పాడు.చిరంజీవి కి కూడా కథ చెప్పినట్లుగా ప్రశాంత్‌ వర్మ పేర్కొన్నాడు.

#Coronavirus #Chiranjeevi #Awe #Akhil #Mahesh Babu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Prashanth Varma Awe Kalki Coronavirus Related Telugu News,Photos/Pics,Images..