కేజీఎఫ్ డైరెక్టర్ ఎవరితో చేస్తే బాక్సులు బద్దలవుతాయి?  

Prashanth Neel To Do With NTR Or Prabhas, Prashanth Neel, NTR, Prabhas, Tollywood News, Pan India Movie - Telugu Ntr, Pan India Movie, Prabhas, Prashanth Neel, Tollywood News

టాలీవుడ్‌లో ప్రస్తుతం పాన్ ఇండియా మూవీల హవా జోరుగా సాగుతోంది.ఇప్పటికే ఈ కోవలో బాహుబలి చిత్రం మొదలుకొని, తాజాగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రాల వరకు ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలను క్రియేట్ చేశాయో అందరికీ తెలిసిందే.

TeluguStop.com - Prashanth Neel To Do With Ntr Or Prabhas

ఇక ఈ సినిమాలను దర్శకులు తెరకెక్కిస్తున్న తీరు కూడా వాటిని ప్రెస్టీజియస్‌గా మారుస్తున్నాయి.ఇక కన్నడలో తెరకెక్కిన కేజీఎఫ్ చిత్రం పాన్ ఇండియా మూవీగా ఎలాంటి విధ్వంసాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే.

ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడంలో పూర్తిగా సక్సె్స్ అయ్యింది.కాగా ఈ సినిమా అందించిన సక్సెస్‌తో కేజీఎఫ్ చిత్రానికి సీక్వెల్‌గా కేజీఎఫ్-2ను తెరకెక్కిస్తున్నారు చిత్ర యూనిట్.

TeluguStop.com - కేజీఎఫ్ డైరెక్టర్ ఎవరితో చేస్తే బాక్సులు బద్దలవుతాయి-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను పూర్తి మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాతో యశ్ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు.ఇక కేజీఎఫ్-2 తరువాత ప్రశాంత్ నీల్ టాలీవుడ్‌లో ఓ భారీ సినిమా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.ఈ క్రమంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌లతో ప్రశాంత్ నీల్ ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.

అయితే పాన్ ఇండియా స్టార్‌గా ఇప్పటికే తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న ప్రభాస్, ఇప్పటికే మూడు సినిమాలను లైన్‌లో పెట్టాడు.ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా మారుతున్నాడు.

అయితే మాస్‌ను పీక్స్‌కు తీసుకెళ్లే సత్తా తారక్‌కు పుష్కలంగా ఉందని, అందుకే కేజీఎఫ్ డైరెక్టర్ తారక్‌తో సినిమా చేస్తే, అది పాన్ ఇండియా మూవీగా రికార్డులను తిరగరాయడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.అటు ప్రేక్షకులు కూడా తారక్‌తో ప్రశాంత్ నీల్ సినిమా వస్తే ఎలాంటి విధ్వంసాన్ని సృష్టిస్తుందో చూడాలని ఆసక్తి చూపుతున్నారు.

మరి ప్రశాంత్ నీల్ తన నెక్ట్స్ మూవీని ఎవరితో చేస్తాడో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

#Pan India Movie #Prashanth Neel #Prabhas

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Prashanth Neel To Do With Ntr Or Prabhas Related Telugu News,Photos/Pics,Images..