ఆ డైరెక్టర్ తో ఎన్టీఆర్ రెండు సినిమాలు కమిట్ అయ్యాడా?

రౌద్రం రణం రుధిరం” సినిమాతో పాన్ ఇండియా మాత్రమే కాదు వరల్డ్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు ఎన్టీఆర్.ఈయన నటించిన ఈ మల్టీ స్టారర్ సినిమా గత ఏడాది రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.

 Prashanth Neel To Direct A Two-part Film With Jr. Ntr,  Koratala Siva, Tollywood-TeluguStop.com

కొమురం భీమ్ పాత్రలో అద్భుతమైన నటన కనబరిచి గ్లోబల్ స్టార్ గా గొప్ప పేరు సంపాదించు కున్నాడు.ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కూడా భారీ లైనప్ సెట్ చేసుకున్నాడు.

ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ తర్వాత టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమాను ప్రకటించాడు.కొరటాల సినిమా ప్రకటించి నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళక పోవడంతో తారక్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.

అయితే తాజాగా ఎన్టీఆర్ ఈ సినిమా మార్చి నుండి రెగ్యురల్ షూట్ కు వెళ్లనుంది అని క్లారిటీ ఇచ్చేసారు.

Telugu Koratala Siva, Ntr, Prashanth Neel, Prashanthneel, Tollywood-Movie

NTR30 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్ నిర్మిస్తుండగా.అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.ఈ సినిమా 2024, ఏప్రిల్ 4న రిలీజ్ చేయనున్నారని తెలుస్తుంది.

ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తన 31వ సినిమాను కూడా ఎవరితో చేయబోతున్నారో ప్రకటించారు.ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాను కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రకటించాడు.

Telugu Koratala Siva, Ntr, Prashanth Neel, Prashanthneel, Tollywood-Movie

భారీ యాక్షన్ మాస్ మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నట్టు అఫిషియల్ అనౌన్స్ మెంట్ సైతం వచ్చింది.మరి ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకు కూడా వెళ్ళలేదు.ఈ లోపులోనే మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.

ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ లో మరో సినిమా కూడా చేయబోతున్నాడు అని టాలీవుడ్ వర్గాల నుండి సమాచారం వస్తుంది.మరి ఈ సినిమా మైత్రి మూవీస్ తో చేసే సినిమాకు సీక్వెల్ నా లేదంటే ఫ్రెష్ మూవీనా అనేది తెలియాల్సి ఉంది.

మొత్తానికి ఈ ప్రచారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube