ప్రశాంత్ తప్పుకుంటే ఆయన ఉన్నాడుగా అంటోన్న తారక్  

Prashanth Neel Ntr Atlee - Telugu Atlee, Kgf, Ntr, Ntr31, Prashanth Neel

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలను తెరకెక్కిస్తూ దూసుకుపోతున్నాడు.ఇప్పటికే దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న తారక్, తన నెక్ట్స్ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.

 Prashanth Neel Ntr Atlee

ఈ సినిమాను ఇప్పటికే అఫీషియల్‌గా లాంఛ్ చేసిన తారక్, త్వరలోనే దీన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నాడు.కాగా ఈ సినిమా తరువాత నాన్-తెలుగు డైరెక్టర్‌తో తారక్ సినిమా ఉండబోతుందనే వార్తలు గతకొద్ది రోజులుగా ఇండస్ట్రీలో వినిపిస్తూ వస్తున్నాయి.

ఈ క్రమంలో తారక్ పుట్టినరోజున కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు.తారక్‌తో తన నెక్ట్స్ మూవీ ఉండబోతుందనే హింట్‌ను తన ట్వీట్ ద్వారా తెలిపాడు.

ప్రశాంత్ తప్పుకుంటే ఆయన ఉన్నాడుగా అంటోన్న తారక్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఈ దెబ్బకు ప్రశాంత్‌ను కన్నడ ప్రేక్షకులు ఓ రేంజ్‌లో ఏసుకుంటున్నారు.కన్నడలో తప్ప మరే ఇతర భాషల్లో సినిమాలు చేయనని చెప్పిన ప్రశాంత్, ఇప్పుడెలా తెలుగు హీరోతో సినిమా చేస్తాడని వారు మండిపడుతున్నారు.

దీంతో అతడిని తెగ ట్రోల్ చేస్తున్నారు.

ఈ ట్రోలింగ్‌కు భయపడి ప్రశాంత్ నీల్ తారక్‌తో సినిమాను క్యాన్సిల్ చేస్తాడేమో అని తెలుగు ప్రేక్షకులు ఆందోళన చెందుతున్నారు.

అయితే ప్రశాంత్ నీల్ తారక్‌తో చేయబోయే సినిమా నుండి వాకౌట్ చేసినా కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తారక్ కోసం తమిళ డైరెక్టర్ అట్లీ ఇప్పటికే ఓ అదిరిపోయే కథను రెడీ చేశాడని చిత్ర వర్గాలు అంటున్నాయి.ఒకవేళ ప్రశాంత్ నీల్ సినిమా వాయిదా పడ్డా కూడా అట్లీ సినిమాతో అదరగొట్టేందుకు తారక్ రెడీగా ఉన్నాడని ఫ్యాన్స్ అంటున్నారు.

మరి తారక్‌తో సినిమా విషయంలో ప్రశాంత్ నీల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Prashanth Neel Ntr Atlee Related Telugu News,Photos/Pics,Images..

footer-test