'కేజీఎఫ్‌' ప్రశాంత్‌ నీల్‌ అలాంటి తప్పు చేస్తాడనుకోవడం లేదు  

కేజీఎఫ్‌ స్టార్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ తదుపరి సినిమా రేపు ప్రకటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.కేజీఎఫ్‌ సినిమాను నిర్మిస్తున్న నిర్మాణ సంస్థ హంబుల్‌ వారు రేపు సినిమాను ప్రకటించబోతున్నారు.

TeluguStop.com - Prashanth Neel Next Movie News

అయితే ఆ సినిమాను డైరెక్ట్‌ చేయబోతున్నది ఎవరు.హీరో ఎవరు అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.

మీడియా వర్గాల్లో మాత్రం ఆ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నది ప్రశాంత్‌ నీల్‌ అని.హీరో ప్రభాస్‌ అంటూ ప్రచారం జరుగుతోంది.ఈ విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు.కాని చాలా జోరుగా ప్రచారం జరుగుతోంది.అది కూడా ఒక కన్నడ సినిమాకు రీమేక్‌ గా అది రూపొందబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.ప్రస్తుతం సినిమా కు సంబంధించిన చర్చ అంతటికి రేపటితో ఫుల్‌ స్టాప్‌ పడబోతుంది.

TeluguStop.com - కేజీఎఫ్‌’ ప్రశాంత్‌ నీల్‌ అలాంటి తప్పు చేస్తాడనుకోవడం లేదు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ప్రభాస్‌ ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్నాడు.ఇప్పటికే రాధేశ్యామ్‌ షూటింగ్‌ ముగింపు దశకు వచ్చింది.ఈ ఏడాది చివరి వరకు సినిమాను కంప్లీట్‌ చేయాలనే పట్టుదలతో దర్శకుడు రాధాకృష్ణ ఉన్నాడు.కాస్త అటు ఇటుగా సినిమా పూర్తి అవ్వడం ఖాయం.జనవరిలో లేదా ఫిబ్రవరిలో ఆదిపురుష్‌ షూటింగ్‌ లో ప్రభాస్‌ జాయిన్‌ అయ్యే అవకాశం ఉంది.ఒక వైపు ఆదిపురుష్‌ సినిమా షూటింగ్‌ లో పాల్గొంటూనే మరో వైపు ప్రభాస్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో సినిమాను కూడా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కనుక ఖచ్చితంగా 2022 పూర్తిగా సినిమాలు చేస్తూ ఉన్నాడు.ఈ సమయంలో ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో సినిమా అంటే 2023 వరకు వెయిట్‌ చేయాల్సిందే అంటున్నారు.

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో సినిమా చేసేందుకు ప్రభాస్‌ రెడీగా ఉన్నాడు.కాని ప్రశాంత్‌ నీల్‌ అంత వరకు వెయిట్‌ చేస్తాడా అనేది చర్చనీయాంశంగా ఉంది.

వచ్చే రెండేళ్ల వరకు ఆయన పూర్తిగా ఖాళీగా ఉండాల్సి ఉంటుంది.మరి ప్రశాంత్‌ నీల్‌ ఉంటాడా అనేది చూడాలి.

#Adipurush #Prabhas #Prashaanth Neel #Radheshyam #KGF Director

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు