పీకే ఎటు ఉంటే గెలుపు అటు.. మళ్లీ నిరూపితం  

Prashanth Kishore Play The Key Role In Aap Win Delhi Elections - Telugu Aap Chief Kejriwal, Delhi Elections, Prashanth Kishore, , Ycp And Prashanth Kishore, Ycp Jagan

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ ఏ పార్టీకి పని చేస్తే ఆ పార్టీ ఎన్నికల్లో గెలుస్తుందని మరోసారి నిరూపితం అయ్యింది.మొన్నటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా తరపున పని చేసిన ప్రశాంత్‌ కిషోర్‌ జగన్‌ను సీఎం చేసిన విషయం తెల్సిందే.

Prashanth Kishore Play The Key Role In Aap Win Delhi Elections

అంతకు ముందు నితీష్‌ కుమార్‌ను బీహార్‌ సీఎంగా చేశాడు.జాతీయ పార్లమెంటు ఎన్నికల్లో మోడీకి మద్దతుగా అప్పట్లో పని చేశాడు.

అప్పుడు కూడా మోడీ గెలిచాడు.ఇప్పుడు ఆమ్‌ ఆద్మీని కూడా హస్తినలో గెలిపించాడు.

గత సంవత్సరంలో ఆమ్‌ ఆద్మీ పార్టీతో కలిసి ప్రశాంత్‌ కిషోర్‌ పని చేశాడు.ఎన్నికల సమయంలో ఆయన పార్టీకి దూరంగా ఉన్నా కూడా అంతకు ముందు మాత్రం ఆయన పార్టీలో కీలక మార్పులు చేర్పులు చేశాడు.

అందుకే ఈ ఎన్నికల్లో మళ్లీ ఆప్‌ గెలిచింది అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి పీకే ఎటు ఉంటే గెలుపు అటు ఉన్నట్లుగా అనిపిస్తుంది అంటూ ఆయన సన్నిహితులు సరదాగా కామెంట్స్‌ చేస్తున్నారు.

తాజా వార్తలు