దుల్కర్ సల్మాన్ ఆవిష్క‌రించిన ప్ర‌శాంత్ వ‌ర్మ‌, తేజ సజ్జ‌, ప్రైమ్‌షో ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ `హ‌ను-మాన్` ఫస్ట్ లుక్ పోస్ట‌ర్‌.

అ!, క‌ల్కి, జాంబిరెడ్డి వంటి డిఫ‌రెంట్ జోన‌ర్ చిత్రాల‌తో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు క‌మ‌ర్షియ‌ల్‌గా కూడా మంచి స‌క్సెస్‌ల‌ను అందుకున్నారు క్రియేటివ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ‌.విభిన్న‌ కాన్సెప్ట్‌లతో కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లను రూపొందించడంలో ప్రశాంత్ వర్మది ప్రత్యేక శైలి.

 Prashant Verma Teja Sajja Prime Show Entertainment Hanu Man First Look Poster Launched By Dulquer Salman-TeluguStop.com

ప్ర‌స్తుతం మరో సారి ఓ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చూట్టారు.హ‌ను-మాన్ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఓ సరికొత్త సినిమాటిక్ జోనర్‌ను పరిచయం చేసేందుకు రెడీ అయ్యారు.

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వ‌చ్చిన `జాంబీరెడ్డి` సినిమాలో తన నటనతో ఆక‌ట్టుకున్న యంగ్ హీరో తేజా సజ్జాతో కలిసి ప్ర‌శాంత్ వ‌ర్మ‌ చేస్తోన్న ఒరిజినల్‌ ఇండియన్‌ సూపర్‌ హీరో ఫిల్మ్‌ ‘హను–మాన్‌’ .హను-మాన్ మొదటి పాన్-ఇండియన్ సూపర్ హీరో మూవీ.జాంబీ రెడ్డి కాంబో మ‌రోసారి మ్యాజిక్ చేసేందుకు సిద్ద‌మైంది.హను-మాన్ సినీ ప్రేక్షకులకు త‌ప్ప‌కుండా ఒక విజువల్ ట్రీట్ అవుతుంది.ఈ రోజు హ‌ను-మాన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు అంజనాద్రి ప్రపంచం నుండి హనుమంతుడిని పరిచయం చేసే 65 సెకన్ల ఫస్ట్ గ్లింప్స్‌ను హీరో దుల్కర్ సల్మాన్ విడుదల చేసారు.

 Prashant Verma Teja Sajja Prime Show Entertainment Hanu Man First Look Poster Launched By Dulquer Salman-దుల్కర్ సల్మాన్ ఆవిష్క‌రించిన ప్ర‌శాంత్ వ‌ర్మ‌, తేజ సజ్జ‌, ప్రైమ్‌షో ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ `హ‌ను-మాన్` ఫస్ట్ లుక్ పోస్ట‌ర్‌.-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రశాంత్‌ వర్మ బర్త్‌ డే సందర్భంగా విడుద‌లైన `హ‌ను-మాన్` టైటిల్, టైటిల్ టీజ‌ర్ కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చిన సంగతి తెలిసిందే.

ఇక ఈ ఫస్ట్ లుక్‌, గ్లింప్స్‌లో తేజ సజ్జా నెవ్వర్ బిఫోర్ అన్నట్టుగా కనిపిస్తున్నారు.తేజ గెటప్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది.అతను ప్రింటెడ్ షర్ట్, తెల్లటి పైజామా ధరించి కనిపిస్తున్నాడు.మెడలో అద్భుతమైన సిల్వర్ కలర్ లాకెట్టు కనిపిస్తోంది.

ఫస్ట్ గ్లింప్స్ విష‌యానికి వ‌స్తే ప్రశాంత్ వర్మ హ‌ను-మాన్ చిత్రం కోసం అంజనాద్రి అనే కొత్త, ఫాంటసీ ప్రపంచాన్ని సృష్టించినట్లు తెలుస్తోంది.వీడియోలో తేజ సజ్జా అడవిలో పరిగెత్తడం, జార‌డం, దూకడం, స్లింగ్‌షాట్‌ను షూట్ చేయడం కనిపిస్తుంది.

సూపర్ హీరో గట్టిగా భూమిని తాకినప్పుడు.అత‌ని పంచింగ్ పవర్ ఏంటో చూపించారు.

సౌండ్ డిజైన్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయాయి.ఫస్ట్ లుక్ పోస్టర్ మ‌రియు గ్లింప్స్ మ‌నల్ని అంజనాద్రి ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ఉన్నాయి.

Telugu Dulquer Salman, Hanu Man, Launched By Dulquer Salman, Prashant Verma, Prime Show Entertainment, Prime Show Entertainment \\'hanu-man` First Look Poster, Teja Sajja-Movie

మన పురాణాలు ఇతీహాసల్లో అద్భుతమైన శక్తులు ఉన్న సూపర్‌హీరోస్‌ గురించి మనకు తెలుసు.వారి అపూర్వమైన శక్తులు, బలాలు, పోరాటపటిమ అద్భుతమైనవి.సూపర్ హీరోస్‌ చిత్రాల్లోని హీరో ఎలివేషన్స్, యాక్షన్‌ సీక్వెన్సెస్‌ ఆడియన్స్‌ను థ్రిల్ చేస్తాయి. అలాగే సూప‌ర్ హీరో మూవీస్‌ని అన్ని వ‌ర్గాల వారు ఇష్ట‌ప‌డ‌తారు.

హ‌ను-మాన్ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలలో రూపొందుతోంది.అన్ని భాషల్లో ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుద‌లైంది.ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని గ్రాండ్ స్కేల్ లో అత్యాధునిక విఎఫ్ఎక్స్ తో రూపొందిస్తోంది.ప్ర‌ముఖ న‌టీన‌టులు, టాప్-గ్రేడ్ టెక్నీషియన్లు ఈ సినిమా కోసం వ‌ర్క్ చేస్తున్నారు.

ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతుంది.ప్ర‌ధాన తారాగ‌ణంపై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు.

శ్రీ‌మ‌తి చైత‌న్య స‌మ‌ర్ప‌ణ‌లో కె.నిరంజ‌న్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.అశ్రిన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌, వెంక‌ట్ కుమార్ జెట్టి లైన్ ప్రొడ్యూస‌ర్‌, కుశ‌ల్ రెడ్డి అసోసియేట్ ప్రొడ్యూస‌ర్‌.దాశ‌ర‌థి శివేంద్ర సినిమాటోగ్రాఫ‌ర్‌.ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నున్నారు.

#Teja Sajja #Dulquer Salman #Prime Show #Prashant Verma #Hanu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు