లవ్ జిహాదీలో ఇరుక్కున్న సంజనా... ప్రూఫ్ చూపించిన ఆర్టీఐ కార్యకర్త

శాండల్ వుడ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ కాబడి జైల్లో ఉన్న నటి సంజనా గల్రానీ మీద ఇప్పటికే అన్ని రకాలుగా ఉచ్చు బిగుసుకుంది.పెళ్లి అయినా కూడా కాలేదని అబద్ధం చెప్పడం, అలాగే ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టడం వంటి విషయాలు ఇప్పుడు కన్నడనాట సంచలనంగా మారాయి.

 Prashant Sambargi Lashes Out At Sanjana Galrani, Kannada Cinema Industry, Drugs-TeluguStop.com

అలాగే ఆమె డ్రగ్స్ మాఫియాతో సత్సంబంధాలు కలిగి ఉండటంపై కూడా పోలీసులు నిజాలు నిగ్గు తేల్చే పనిలో ఉన్నారు.సెలబ్రిటీ ముసుగులో, అందం ఉంటే ఏదైనా చేసేయొచ్చు అనే భ్రమలో ఉన్న చాలా మంది హీరోయిన్స్ కి ఇప్పుడు సంజనా గల్రానీ, రాగినీ ద్వివేది ఒక ప్రత్యక్ష ఉదాహరణకి కనిపిస్తారు.ఇదిలా ఉంటే సంజనా గల్రానీ లవ్ జిహాద్ లో చిక్కుకొని తన మతం మార్చుకొని మహిరాగా పేరు మార్చుకుందని ప్రముఖ సమాచార హక్కుల కార్యకర్త ప్రశాంత సంబర్గి ఆరోపిస్తున్నారు.

2018లోనే ఈ ఘటన జరిగిందని, ఆమె హిందూ మతాన్ని వీడి, ముస్లిం మతానికి మారిపోయారని చెప్పడంతో ఆమె మతం మారినట్లు ముస్లిం పెద్దలు ఇచ్చిన సర్టిఫికేట్ ని కూడా పేస్ బుక్ లో పోస్ట్ చేశాడు.ఈ పోస్ట్ కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది.అయితే సంజనా గల్రానీ ఇక ముస్లిం డాక్టర్ ని వివాహం చేసుకొని, తన మతం కూడా మార్చుకొని పేరు కూడా మార్చుకున్న నేపధ్యంలో ఎఫ్ఐఆర్ లో ఆమె పేరు మహిరాగా నమోదు చేయాలని, అదే పేరుతో ఆమెని విచారించాలని, సంజనాను ఇస్లాం మతం స్వీకరించిన కారణంగా మహీరా అనే పిలవాలంటూ ప్రశాంత్ సంబర్గి వ్యాఖ్యానించారు.

గతంలో ఆమె బెంగళూరు చామరాజపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ తో కలిసి శ్రీలంక టూర్ కు వెళ్లారని కూడా ఆరోపించారు.మొత్తానికి సంజనాని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేస్తే ఆమె ఎక్స్ ట్రా భాగోతాలు అన్ని ఒక్కొక్కటిగా బయటకి రావడం ఇప్పుడు సంచలనంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube