కొందరు సీజీలో సినిమాలు చేస్తారు.. మేం దుమ్ములో చేస్తాం.. ప్రశాంత్ నీల్ భారీ షాకిచ్చాడుగా!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్( Prashant Neel ) ఇతర డైరెక్టర్లకు చాలా విషయాలలో భిన్నంగా వ్యవహరిస్తారు.

హీరోలను అందంగా చూపించడం కంటే డార్క్ షేడ్స్ లో చూపించడానికి ప్రశాంత్ నీల్ ఇష్టపడతారు.

ప్రశాంత్ నీల్ సినిమాలన్నీ దుమ్ములో గ్రాండ్ విజువల్స్ తో ఉంటాయి.అయితే హీరోలను మాత్రం ఊరమాస్ లుక్ లో చూపిస్తారు.

సలార్ సినిమాపై( Salaar ) ఆకాశమే హద్దుగా అంచనాలు ఏర్పడగా ప్రభాస్( Prabhas ) కోరుకున్న సక్సెస్ ను అందించడం ప్రశాంత్ కే సాధ్యమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.అయితే ప్రశాంత్ నీల్ తాజాగా చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆదిపురుష్ మూవీపై( Adipurush Movie ) సెటైరికల్ గా ప్రశాంత్ నీల్ ఈ కామెంట్లు చేసి ఉండవచ్చని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.సెప్టెంబర్ నెల 28వ తేదీన సలార్ మూవీ థియేటర్లలో విడుదల కానుంది.

Advertisement

తాజాగా ప్రశాంత్ నీల్ మీడియాతో మాట్లాడుతూ కొందరు సీజీలో చేస్తే మేం దుమ్ములో చేస్తాం అంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేశారు.

ఓం రౌత్ ఆదిపురుష్ సినిమాలోని సగానికి పైగా సన్నివేశాలను సీజీలో తెరకెక్కించారు.విజువల్ ఎఫెక్స్ట్ పొరపాట్ల వల్లే ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదని కామెంట్లు వ్యక్తమయ్యాయి.ఆదిపురుష్ సినిమాను కొంతమంది వివాదపురుష్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఈ సినిమా వరుసగా వివాదాల్లో చిక్కుకోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

ఆదిపురుష్ సినిమాను ఏ మూహూర్తాన మొదలుపెట్టారో తెలీదు కానీ ఈ సినిమా అన్ని వివాదాల్లో చిక్కుకోవడం హాట్ టాపిక్ అవుతోంది.ఆదిపురుష్ రిజల్ట్ గురించి, వివాదాల గురించి ప్రభాస్ నోరు మెదపడం లేదు.ఈ సినిమా ఫలితాన్ని ప్రభాస్ ముందుగానే ఊహించారని అందుకే వివాదాలకు దూరంగా ఉన్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్12, గురువారం2024
రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

ప్రశాంత్ నీల్ కామెంట్ల విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు