ప్రభాస్ ప్రశాంత్ నీల్ సలార్ సినిమాతో చరిత్ర సృష్టించడంతో పాటు కలెక్షన్ల ద్వారా చరిత్రను తిరగరాస్తున్నారు.సలార్ పూర్తి కథ వినకుండానే ప్రభాస్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.
ప్రశాంత్ నీల్ ప్రభాస్ కు సలార్ స్టార్టింగ్, ఎండింగ్ మాత్రమే చెప్పారని స్టోరీ లైన్ విని ప్రభాస్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.అయితే ప్రభాస్ లో ప్రశాంత్ నీల్ కు నచ్చని ఒకే ఒక్క విషయం ఉందట.

ప్రశాంత్ నీల్( Prashanth Neel ) ఏం చెయ్యమని కోరినా ప్రభాస్ ఎందుకు అని ఏ సీన్ తర్వాత ఏ సీన్ వస్తుందని కూడా అడగలేదట.అలా చెప్పింది చెప్పినట్టు ప్రభాస్ చేస్తుండటంతో ప్రశాంత్ నీల్ ఆశ్చర్యానికి గురయ్యాడట.ప్రభాస్ అంత గుడ్డిగా నమ్మడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసిందని ప్రభాస్ నన్ను ఒక్క ప్రశ్న కూడా అడగకపోవడం నాకు నచ్చలేదని ప్రశాంత్ నీల్ కామెంట్లు చేశారు.రాజమౌళితో ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ ఈ విషయాలను చెప్పుకొచ్చారు.

ఫస్ట్ వీకెండ్ సమయానికి ఈ సినిమా 500 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లను సాధించే ఛాన్స్ అయితే ఉంది.ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో మరికొన్ని సినిమాలు రావాలని ఫ్యాన్స్ కోరుకున్నారు.2025 సంవత్సరంలో సలార్2 మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం అయితే ఉంది.ఎన్టీఆర్ మూవీని పూర్తి చేసి ప్రశాంత్ నీల్ ఈ సినిమాను మొదలుపెట్టనున్నారని సమాచారం అందుతోంది.
ప్రశాంత్ నీల్ తక్కువ సమయంలోనే సినిమాలను తెరకెక్కిస్తూ విజయాలను అందుకుంటున్నారు.ప్రశాంత్ నీల్ సినిమాలు నిర్మాతలకు సైతం మంచి లాభాలను అందుకుంటున్నారు.
ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో నటించాలని చాలామంది హీరోలు ఆశ పడుతుండగా ప్రశాంత్ నీల్ త్వరలో మరిన్ని కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించే ఛాన్స్ ఉంది.