ఏపీ తెలంగాణ పై ప్రశాంత్ కిషోర్ 'ముద్ర ' ! అన్ని పార్టీలకూ వారే ?

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం రసవత్తరం గా మారింది.ఎన్నికలు ఇప్పట్లో లేకపోయినా, అప్పుడే సార్వత్రిక ఎన్నికలు వచ్చేసినట్లుగా అన్ని పార్టీలు హడావుడి చేస్తున్నాయి.

 Prashant Kishores Increased Prominence In Ap Telangana-TeluguStop.com

ఒకరిపై ఒకరు విమర్శలు తీవ్రతరం చేసుకోవడంతో పాటు, ప్రజల్లో తమ బలం తగ్గకుండా చూసుకుంటున్నారు.తమ ప్రత్యర్థులను ఎదుర్కునేందుకు తమ బలం ఒకటే సరిపోదని,  దీనికోసం ప్రత్యేకంగా ఒక వ్యూహ కర్తలను నియమించుకుంటే తమకు టెన్షన్ ఉండదు అనే ఆలోచనతో,అన్ని రాజకీయ పార్టీలు వ్యూహ కర్తలను నియంచుకుని, అధికారానికి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి.

ఇప్పటికే ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ప్రశాంత్ కిషోర్ అనే రాజకీయ వ్యూహకర్త సహకారం తీసుకుంది.ప్రశాంత్ కిషోర్ సలహాలు, సూచనలతో వైసిపి ముందుకు వెళ్ళడంతో, ఏపీలో అఖండ మెజార్టీతో వైసీపీ విజయం సాధించగలిగింది.

 Prashant Kishores Increased Prominence In Ap Telangana-ఏపీ తెలంగాణ పై ప్రశాంత్ కిషోర్ ముద్ర అన్ని పార్టీలకూ వారే -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

      దీంతో వ్యూహకర్తల ఆలోచన అన్ని పార్టీలకు వచ్చింది. టిడిపి కూడా ప్రశాంత్ కిషోర్ టీంలో పని చేసి బయటకు వచ్చిన రాబిన్ శర్మ అనే వ్యూహకర్త ను నియమించుకుంది.

ఇక తెలంగాణలో కొత్త పార్టీ పెట్టిన వైయస్ షర్మిల ప్రశాంత్ కిషోర్ టీం లో పనిచేస్తున్న  ప్రియా నియమించుకుంది.ఇక వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ పార్టీ సైతం ఇప్పుడు ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్న క్రమంలో, వ్యూహకర్త ను నియమించుకోవాలనే ఆలోచనలో ఉంది .అది కూడా ప్రశాంత్ కిషోర్ టీంలో పని చేసిన వారిని ఎంపిక చేయాలని చూస్తోంది.ఇక ఎలాగూ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కు వ్యూహకర్తగా ఉండేందుకు పరోక్షంగా ప్రశాంత్ కిషోర్ అంగీకారం తెలిపినట్లు ప్రచారం జరుగుతోంది.
   

Telugu Ap, Kcr, Prasanth Kishore, Priya, Rabin Sharma, Sharmila, Tdp, Telangana, Trs, Ysrtp-Telugu Political News

    ఇటీవల రాహుల్ తో ప్రశాంత్ కిషోర్ భేటీ కావడం తో ఒక దశలో ఆయన కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరిగింది.ఒకవేళ కాంగ్రెస్ తరఫున అధికారికంగా ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్తగా బాధ్యతలు తీసుకుంటే, ఆ ప్రభావం తెలంగాణ కాంగ్రెస్ కు ఉంటుంది.ఇలా అన్ని పార్టీలు వ్యూహ కర్తలను నియమించుకోవడం,  అది కూడా ప్రశాంత్ కిషోర్ టీమ్ నుంచే ఎంపిక చేయడం చూస్తుంటే ప్రశాంత్ కిషోర్ ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాల్లో పై ఎంతగా ఉందో అర్థం అవుతోంది.ఇప్పుడు అన్ని పార్టీలకు రాజకీయ వ్యూహ కర్తలుగా ఉన్నవారంతా ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐ ప్యాక్ టీమ్ నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం.

   

#Telangana #Priya #Rabin Sharma #Ysrtp #Sharmila

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు