ప్రశాంత్ కిషోర్ సంచలన నిర్ణయం ! సలహాదారు పదవికి రాజీనామా

దేశ వ్యాప్తంగా అనేక పార్టీలు అధికారం చేపట్టేందుకు అవసరమైన రాజకీయ వ్యూహాలను అందించి సక్సెస్ ఫుల్ రాజకీయ వ్యూహకర్తగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ప్రశాంత్ కిషోర్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చే పనిలో ప్రశాంత్ కిషోర్ నిమగ్నమయ్యారు.

 Prashant Kishore Resigns As Punjab Governments Chief Adviser-TeluguStop.com

గతంలో ఏపీలో వైసీపీ, తమిళనాడులో డిఎంకె, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్లో మమతాబెనర్జీ ఇలా అందరూ ఆయా రాష్ట్రాల్లో అధికారంలోకి రావడానికి ప్రశాంత్ కిషోర్ సలహాల్ని తీసుకున్నారు.దీంతో పాటు ఆయన 2017 లో పంజాబ్ ఎన్నికలకు కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్తగా పని చేశారు.ఆ ఎన్నికల్లో విజయం సాధించడంతో పీకే ప్రాధాన్యం పెరిగింది.2021 లోనే ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేందర్ సింగ్ ప్రధాన రాజకీయ సలహాదారుడుగా పీకే నియమితులయ్యారు.

అయితే వచ్చే ఏడాది పంజాబ్ లో ఎన్నికలు జరగనున్నాయి.ఈ నేపథ్యంలో ఇప్పుడు తన ప్రధాన సలహాదారు పదవికి ప్రశాంత్ కిషోర్ రాజీనామా చేయడం చర్చనీయాంశం అవుతోంది.” ప్రజా జీవితంలో చురుకైన పాత్ర నుంచి తాత్కాలిక సెలవు తీసుకోవాలనే నా నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకుని మీకు ప్రిన్సిపల్ అడ్వైజర్ గా నేను బాధ్యతలు నిర్వహించలేకపోతున్నాను.దయచేసి ఈ బాధ్యత నుచి నన్ను విడిపించమని అభ్యర్థిస్తున్నాను.

 Prashant Kishore Resigns As Punjab Governments Chief Adviser-ప్రశాంత్ కిషోర్ సంచలన నిర్ణయం సలహాదారు పదవికి రాజీనామా-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పటికైతే నా భవిష్యత్ కార్యాచరణపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోనప్పటికీ, నన్ను నా విధుల నుంచి రిలీవ్ చేయాల్సిందిగా కోరుతున్నాను ‘ అంటూ సీఎం కు రాసిన లేఖలో ప్రశాంత్ కిషోర్ అభ్యర్థించారు.

కాకపోతే రాజకీయ సమీకరణాలను పరిష్కరించే పని తన ఐ ప్యాక్ టీమ్ చేస్తుందని ఆయన ప్రకటించారు.అయితే ఆయన క్రియాశీలక రాజకీయాలలో యాక్టివ్ అయ్యే అందుకే ఇప్పుడు సలహాదారు పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.ఆయన గత కొంత కాలంగా కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జోరందుకుంది.

ఈ నేపథ్యంలోనే ఆయన ప్రభుత్వ ప్రధాన సలహాదారు బాధ్యత నుంచి తప్పుకోవడం చర్చనీయాంశం అవుతోంది.ఆయన కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ లో అధికారికంగా చేరే అవకాశం ఉంది.

ఈ ఏడాది మార్చిలోనే అమరీందర్ సింగ్ ప్రధాన సలహాదారుడిగా ప్రశాంత్ కిషోర్ నియమితులయ్యారు.అంతేకాకుండా ఆయనకు క్యాబినెట్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

#SONIA #Rahul Gandi #Punjab Advasior #Punjab CM #Stalin

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు