వైసీపీ రాజకీయ వ్యూహకర్తపై బీజేపీ కన్ను ఢిల్లీకి రావాల్సిందిగా పిలుపు

కేంద్ర అధికార పార్టీ బీజేపీకి రాజకీయ వ్యూహకర్తల అవసరం బాగా వచ్చినట్టు కనిపిస్తోంది.తమకు తామే మేధావులుగా ఊహించుకునే బీజేపీలో ఇప్పుడు వ్యూహకర్తల అవసరం బాగా వచ్చినట్టు కనిపిస్తోంది.

 Prashant Kishor To Work For Narendra Modi Again-TeluguStop.com

గత ఎన్నికల్లో ఇలాంటి వ్యూహాలే రచించి బీజేపీ కేంద్ర అధికార పీఠంలో కూర్చుంది.ఆ క్రెడిట్ అంత నరేంద్ర మోదీ డే అని అందరూ అనుకున్నారు కానీ అందులో కొంతమేర క్రెడిట్ బీజేపీకి రాజకీయ వ్యూహకర్తగా పనిచేసిన బీహార్ బాబు ప్రశాంత్ కిషోర్ వ్యూహం కూడా ఉంది.అయితే కొంతమంది బీజేపీ పెద్దలతో ప్రశాంత్ కిషోర్ ( పీకే) కి విబేధాలు తలెత్తడంతో బీజేపీకి ఆయన దూరంగా జరిగాడు.

2014 ఎన్నికల తరువాత యూపీ, బీహార్‌, పంజాబ్‌లో వివిధ పార్టీలకు పనిచేసిన ప్రశాంత కిషోర్ ఇపుడు ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తున్నారు.ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ ఉన్నతస్థాయి సమావేశంలో బీజేపీ నుంచి ఆయనకు పిలుపు వచ్చింది.ప్రశాంత్ కిషోర్ ఎపుడూ బీజేపీలోని పెద్ద తలకాయలతో సంబంధాలు కొనసాగిస్తూనే ఉన్నారని బీజేపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ మధ్యకాలంలో అనేక సార్లు ప్రధాని మోడీతో ప్రశాంత్ కిషోర్ కలిసినట్లు ఇండియా టుడే టీవీ పేర్కొంది.వీరిద్దరి మధ్య 2019 ఎన్నికలపై సుదీర్ఘ చర్చ జరిగినట్లు ఆ టీవీ పేర్కొంది.ఈసారి ఎన్నికల్లోనూ 2014లో మాదిరి యువత చాలా కీలక పాత్ర పోషించనుందని ప్రశాంత్ కిషోర్‌… ప్రధాని మోడీకి తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి.
అలాగే పార్టీ అధ్యక్షడు అమిత్ షాతో కూడా ప్రశాంత్ కిశోర్ అనేక సార్లు భేటీ అయినట్లు ఇండియా టీవీ పేర్కొంది.

గతంలో పార్టీలో ఉన్నత పదవి కోరడంతో అమిత్ షాకు, ప్రశాంత కిషోర్ మధ్య విభేదాలు వచ్చి ఆ పార్టీకి దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ సర్కార్ కి ఎదురుగాలి వీస్తుండడంతో పీకే అవసరాన్ని గుర్తించిన బీజేపీ పెద్దలు ఆయన్ను చేరదీస్తేనే రాజకీయంగా కలిసి వస్తుందనే అంచులకు వచ్చారని తెలుస్తోంది.

అయితే ప్రస్తుతం పీకే వైసీపీకి రాజకీయ వ్యూహకర్తగా పనిచేస్తున్నారు.బీజేపీ నుంచి ఇప్పుడు పిలుపు రావడంతో పీకే వైసీపీకి గుడ్ బాయ్ చెప్పేస్తారు లేక బీజేపీ – వైసీపీలను బ్యాలెన్స్ చేసుకుంటూ తన రాజకీయ వ్యూహాలను రూపొందిస్తాడా అనేది తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube