ప్రశాంత్ కిషోర్ సర్వే...తలపట్టుకున్న జగన్..

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటారు…అవకాశం ఉండగానే దూసుకుపోవాలి అంటారు.సామెతలు ఊరికే పుట్టలేదు.

 Prashant Kishor Survey Creates Headache To Jagan-TeluguStop.com

ఎంతో మంది అనుభవజ్ఞులైన వారు చెప్పిన వారు చెప్పే సూత్రలని ఎప్పటికప్పుడు ఫాలో అయిపోవాలి అయితే అందివచ్చిన అవకాశాలని ఉపయోగించు కోవడం లో ఏపీ లో చంద్రబాబు కి తెలిసినంతగా మరే నాయకుడికి తెలియదు.ఈ విషయంలో వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి మాత్రం చాలా వీక్ అనే చెప్పాలి…ఎందుకంటే కేంద్రం విభజన హమీలని నెరవేర్చకుండా.

ప్రత్యేక హోదా విషయంలో మోసం చేసినప్పుడు మొట్టమొదటి సారిగా జగన్ తన గళాన్ని ఎత్తుకున్నారు.ఒక పక్క పాదయాత్ర చేస్తూనే మరో పక్క ప్రత్యేక హోదా ఉద్యమం చేసి ఒక్కసారిగా ఏపీలో ప్రజలని తనవైపు తిప్పుకున్నారు.అయితే

ఇదే సమయంలో కేంద్రం తో గొడవలు పడి బయటకి వచ్చేసిన చంద్రబాబు ఈ ఉద్యమం భవిష్యత్తులో ఎలా ఉంటుందో ఊహించిన బాబు ఎంతో చాకచక్యంగా ఉద్యమాన్ని తనవైపుకి తిప్పుకున్నారు.అయితే ఈ క్రమంలో నే బీజేపి తో చేతులు కలపడం తో జగన్ ఉద్యమం మెల్ల మెల్లగా నీరు గారిపోతూ వచ్చింది అయితే ఇదే సమయంలో హోదా కోసం హామీల కోసం తన ఎంపీలతో రాజీనామలు చేయించిన జగన్ మోహన్ రెడ్డికి ఊహించని మద్దతు ప్రజల నుంచి వచ్చింది.ఈ ఊపుని ఇలాగే చేసిఉంటే బాగుండేది అయితే బీజేపి సూచనలతో జగన్ వెనకడుగు వేశాడు అయితే బాబు మాత్రం ఎదో ఒక రూపంలో ఇప్పటికే నిరసనలు తెలుపుతూ పార్టీపై ప్రజలకి మరింత నమ్మకాన్ని కలిగేలా చేశారు.అయితే తాజాగా వైసీపి

ఎంపీల రాజానామాలని స్పీకర్ ఆమోదించిన తరుణంలో గతంలో రాజీనామాలు చేస్తామని ప్రకటిస్తేనే ప్రజలలో భారీ రెస్పాన్స్ వచ్చింది ఈ సారి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అనుకున్న జగన్ అండ్ కో కి ప్రజలు గూబ గుయ్యిమని సమాధానం ఇచ్చారట…కనీసం స్పీకర్ ఎంపీల రాజీనామా ఆమోదించిన సమయంలో ఎవరూ రెస్పాన్స్ అవ్వలేదు కనీసం హడావిడి కూడా లేదు దాంతో జగన్ ప్రశాంత్ కిశోర్ ని పిలిచి తాజాగా జరిగిన పరిస్థితులపై సర్వే చేయమని చెప్పాడట.

అయితే ఈ సర్వే సారంశం ఏమిటంటే.రాజీనామాలని స్పీకర్ ఆమోదించిన విషయంలో ప్రజలలో స్పందన ఎలా ఉంది అని అయితే ఆ సర్వేలో వచ్చిన రిజల్స్ చూసిన జగన్ రెడ్డి కి మైండ్ బ్లాకి అయ్యిందట.

సర్వేలో ఏమి తెలిసిందంటే ఏపీ ప్రజలలో కనీసం 10 శాతం మంది ప్రజలు కూడా ఈ విషయంపై చర్చించుకోలేదట ఈ పరిస్థితికి రీజన్ ఏంటో దానికి కారణం కూడా చెప్పారట ప్రత్యేక హోదా విషయంలో జగన్ ఎప్పుడు చంద్రబాబు నే టార్గెట్ చేస్తున్నాడు తప్ప కేంద్రాన్ని ఒక్క మాటకూడా అనడం లేదు.అసలు హోదా ఇచ్చేది చంద్రబాబు నా లేక కేంద్రమా అని ఘాటుగానే ప్రశ్నించారట.

దాంతో జగన్ చంద్రబాబును టార్గెట్ చేసి అదే గోతిలో పడ్డాడని అర్థం అవుతోంది.ఆంతేకాదు జగన్ పాదయాత్ర చేసిన సంపాదించిన మైలేజ్ కాస్తా మోడీ తో జట్టుకట్టి ఒక్కదెబ్బతో పోగొట్టుకున్నారట టాక్ వినిపిస్తోంది.

అయితే ఈ విషయాలే పీకే తమ అధినేత పవన్ కళ్యాణ్ కి విన్నవించడంతో జగన్ ఒక్క సరిగా షాక్ కి గురయ్యాడట.ఈ విషయంపై త్వరలో పార్టీలోని కీలక నేతలతో సమావేశం అయ్యి చర్చించనున్నారని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube